Battery Swapping Stations: హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్
Battery Swapping Stations: ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్..
Battery Swapping Stations: ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. చమురు ధరల పెరుగుదల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల ప్రజలు పెట్రోల్, డీజిల్తోనడిచే బైక్‌లు, కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ డిస్‌ఛార్జ్ అయినట్లయితే పరిస్థితి ఏమిటి.? ఆ సమయంలో బ్యాటరీలు మార్చుకునే సదుపాయం ఉంటే బాగుండు అనే సందేహం కలుగుతుంది. అలాంటి వారికి గుడ్‌న్యూస్ చెప్పబోతోంది తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO). హైదరాబాద్ (Hyderabad) నగరంలో బ్యాటరీ స్వాపింగ్ (Battery Swapping) సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మొదటి విడతలో ఆరు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు:
నగరంలో మొదటి విడతలో భాగంగా 6 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్‌ఈడీసీఓ అధికారులు నిర్ణయించారు. అయితే ఈ సెంటర్‌లో ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువైన స్వాపింగ్ బ్యాటరీలను అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఈ బ్యాటరీ స్వాపింగ్ సెంటర్‌లో సులభంగా బ్యాటరీ మార్చుకోవచ్చని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: