AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: టిక్కెట్ లేకపోతే తిక్క తీరేలా రైల్వే చర్యలు.. జరిమానాతో పాటు జైలు శిక్ష

భారతదేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే అందరికీ టక్కున గుర్తుచ్చేది రైలు. రైల్వే ప్రయాణం అనేది భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా మారింది. రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ స్థాయిలో ప్రయాణికుల్లో మనం ఏ పాటి అనే చందాన చాలా మంది టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఏటా వీరి వల్ల రైల్వేకు కోట్లల్లో నష్టం వస్తుంది. అంతేకాకుండా రైళ్లల్లో జరిగే దొంగతనాలకు చాలా వరకు టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారే కారణం అవుతున్నారు.

Indian Railways: టిక్కెట్ లేకపోతే తిక్క తీరేలా రైల్వే చర్యలు.. జరిమానాతో పాటు జైలు శిక్ష
Indian Railways
Nikhil
|

Updated on: Jul 26, 2024 | 3:30 PM

Share

భారతదేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే అందరికీ టక్కున గుర్తుచ్చేది రైలు. రైల్వే ప్రయాణం అనేది భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా మారింది. రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ స్థాయిలో ప్రయాణికుల్లో మనం ఏ పాటి అనే చందాన చాలా మంది టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఏటా వీరి వల్ల రైల్వేకు కోట్లల్లో నష్టం వస్తుంది. అంతేకాకుండా రైళ్లల్లో జరిగే దొంగతనాలకు చాలా వరకు టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారే కారణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లల్లో టిక్కెట్ లెస్ ప్రయాణాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తుందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రైళ్లల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఎదుర్కోవాల్సిన ఇబ్బందుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అధికారిక నిబంధనల ప్రకారం భారతీయ రైల్వే టికెట్ లేకుండా ప్రయాణించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా రైలులో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే జరిమానా విధిస్తుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం ప్రయాణికుడు ప్రయాణించిన దూరానికి లేదా స్టార్టింగ్ స్టేషన్ నుండి అదనంగా రూ.250 ఛార్జీతో సాధారణ సింగిల్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో పాటు మొత్తం రైల్వే టిక్కెట్ ఛార్జీని కూడా వసూలు చేస్తారు. అలాగే మోసపూరిత ప్రయాణానికి రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం 6 నెలల జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు. అలారం చైను లాగితే 12 నెలల జైలు శిక్ష లేదా రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. వికలాంగ ప్రయాణికుల కోసం రిజర్వ్ చేసిన కోచ్‌లో సాధారణ ప్రయాణీకుడు ప్రయాణిస్తే వారికి 3 నెలల జైలు, రూ. 500 జరిమానా లేదా రెండూ పొందవచ్చు. అలాగే రైలు పైకప్పుపై ప్రయాణం చేస్తే 3 నెలల జైలు లేదా రూ. 500 జరిమానా లేదా రెండూ విధిస్తారు. 

భారతీయ రైల్వేలు భద్రత పై ఎక్కువ ఖర్చు చేయనుందని, ఈ మేరకు రైల్వే మంత్రి పార్లమెంట్లో ప్రకటించారు. కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) సిస్టమ్ ద్వారా ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే రూ. 2.62 లక్షల కోట్ల బడ్జెట్ వ్యయంలో దాదాపు సగం ఖర్చు చేయాలని యోచిస్తోంది. సాధారణ, నాన్-ఏసీ ప్రయాణీకుల కోసం మరిన్ని కోచ్‌లను అందుబాటులో తీసుకొస్తామని రైల్వే మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..