AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ అకౌంట్స్ పై కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి అమలు..

బ్యాంకులు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ.. ప్రైవేటు రంగ

బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ అకౌంట్స్ పై కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి అమలు..
Punjab National Bank
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2021 | 12:52 PM

Share

బ్యాంకులు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ.. ప్రైవేటు రంగ బ్యాంకులు తీసుకునే కీలక నిర్ణయాలు ఆయా ఖాతాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందుకే బ్యాంకులలో ఖాతాలు ఉన్నవారు… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఉండాలి. ఇక దేశీయ దిగ్గజ బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా ఒకటి. ఇందులో సేవింగ్స్ ఖాతా ఉన్న కస్టమర్లు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకు ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో కొత్త.. పాత కస్టమర్లతోపాటు.. ఎన్ఆర్ఐ కస్టమర్ల ఖాతాలపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. 10 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. రూ. 10 లక్షలలోపు బ్యాలెన్స్ కలిగిన అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. అలాగే రూ. 10 లక్షలు లేదా ఆపైన మొత్తం కలిగిన బ్యాంకు ఖాతాలపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గనుంది. దీంతో రూ. 10 లక్షలలోపు బ్యాలెన్స్ కలిగిన ఖాతాలకు 2.8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

గతంలో సెప్టెంబర్ 1న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 2.90 శాతానికి తగ్గించింది. అదే రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. అప్పుడు 2.85 శాతం వడ్డీ వస్తుంది. అలాగే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాలపై సంవత్సరానికి రూ. 2.70 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. అలాగే ఒక లక్ష వరకు డిపాజిట్లపై ఎస్బీఐ 2.70 శాతం వడ్డీని ఇస్తుంది.

ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులలో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే.. ఐడీబీఐ బ్యాంక్.. 3 నుంచి 3.25 శాతం.. కెనరా బ్యాంక్.. 2.90 శాతం నుంచి 3.20 శాతం వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా.. 2.75 శాతం నుంచి 3.20 శాతం వరకు..

ఇక ప్రైవేట్ రంగ బ్యాంకులలో 3 నుంచి 5 శాతం వరకు వడ్డీ రేట్లు.. హెచ్‏డీఎఫ్‏సీ బ్యాంక్.. 3 నుంచి 3.5 శాతం.. ఐసీఐసీఐ బ్యాంక్.. 3 నుంచి 3.5 శాతం. కోటక్ మహీంద్రా బ్యాంక్.. 3.5 శాతం. ఇండస్ ఇండ్ బ్యాంక్.. 4 నుంచి 5 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.

Also Read: Nora Fatehi: సత్యమేవ జయతే 2 నుంచి కుసు సాంగ్ రిలీజ్.. మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన నోరా ఫతేహి..

Sajjanar vs Rapido Ad: క్రిమినల్ కేసులు పెడతాం.. అల్లు అర్జున్, ర్యాపిడోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్టీసీ ఎండి సజ్జనార్..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్