AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Bill: మీరు క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Credit Card Bill: చాలా మంది క్రెడిట్‌ కార్డులు వాడుతుంటారు. గతంలో బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్‌ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా..

Credit Card Bill: మీరు క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!
Credit Card Bill
Subhash Goud
|

Updated on: Nov 10, 2021 | 12:29 PM

Share

Credit Card Bill: చాలా మంది క్రెడిట్‌ కార్డులు వాడుతుంటారు. గతంలో బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్‌ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది. కేవలం ఫోన్‌ ద్వారానా వివరాలు తెలుసుకుని ఆధార్‌ వివరాలతో కార్డును జారీ చేస్తున్నాయి బ్యాంకులు. కానీ క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి చెల్లించకపోతే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కార్డు ఇచ్చిన తర్వాత కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు వాడితే బిల్లు చెల్లించే ముందు ఇబ్బందులు తలెత్తుతాయి.

చెల్లింపు గడువు తేదీ: ముఖ్యంగా కార్డులోని డబ్బులు వాడిన తర్వాత చెల్లింపు గడువును గుర్తించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపు తేదీ గడిచిపోతే మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తం బాకీ.. క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందులో పూర్తిగా చెల్లించకుండా సగం సగం చెల్లించినట్లయితే మీరు అప్పుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది. ఆ బిల్లు మొత్తంపై వడ్డీ విధిస్తాయి బ్యాంకులు. అలాగే మినిమమ్‌ బిల్లులు చెల్లించినా మీకు పెనాల్టీ విధిస్తుంటాయి.

వడ్డీ లేకుండా.. బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేసే సమయంలో కస్టమర్‌కు 45-50 రోజుల వడ్డీ రహిత వ్యవధిని ఇస్తారు. ఈ కాలంలో బకాయి మొత్తం అదనపు ఛార్జీ లేకుండా చెల్లించవచ్చు. కానీ ఆ సమయం దాటి బిల్లు చెల్లిస్తే మాత్రం 34 శాతం నుంచి 40 శాతం వరకు అధిక వడ్డీ రేటుతో చెల్లించుకోవాల్సి ఉంటుంది.

నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రస్తుతం కాలంలో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. కార్డును వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సమయానికి బిల్లు చెల్లించని పక్షంలో పెనాల్టీల మోత మోగుతుందని గుర్తించుకోవాలి.

ఇవి కూడా చదవండి:

RBI Hackathon: డిజిటల్‌ చెల్లింపులపై ఆర్బీఐ హ్యాకథాన్‌.. రూ.40 లక్షలు గెలుచుకునే అవకాశం..!

Bank Interest Rates: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. గృహ రుణాలపై స్వల్పంగా వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం..!

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!