Sajjanar vs Rapido Ad: క్రిమినల్ కేసులు పెడతాం.. అల్లు అర్జున్, ర్యాపిడోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్టీసీ ఎండి సజ్జనార్..

Sajjanar vs Rapido Ad: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కింద నడుస్తున్న ప్రజా రవాణాను కించపరుస్తూ ర్యాపిడో తీసిన యాడ్‌లో టాలీవుడ్ నటుడు అల్లూ అర్జున్ నటించడంపై..

Sajjanar vs Rapido Ad: క్రిమినల్ కేసులు పెడతాం.. అల్లు అర్జున్, ర్యాపిడోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్టీసీ ఎండి సజ్జనార్..
Sajjanar
Follow us

|

Updated on: Nov 10, 2021 | 11:58 AM

Sajjanar vs Rapido Ad: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కింద నడుస్తున్న ప్రజా రవాణాను కించపరుస్తూ ర్యాపిడో తీసిన యాడ్‌లో టాలీవుడ్ నటుడు అల్లూ అర్జున్ నటించడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ప్రయాణిస్తున్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను కించపరిస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోట్లకు కోసం ఆశపడి టీఆర్ఎస్‌ఆర్టీసీని కించపరచొద్దని హెచ్చరించారు. సెలబ్రెటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు చెప్పారు. ‘రూ. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుని లగ్జరీ కార్లలో తిరుగుతారు.. ఆర్టీసీ బస్సుల్లో తిరిగే సామాన్యులంటే చిన్నచూపా’ అంటూ సెలబ్రిటీలపై ఫైర్ అయ్యారు సజ్జనార్. ఆర్టీసీ ప్రయాణాన్ని కించపరుస్తూ తీసిన యాడ్‌పై అల్లు అర్జున్, ర్యాపిడో ఏజెన్సీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాపిడో యాడ్‌లో చూపిన బస్సు తెలంగాణ బస్సేనని అన్నారు. హెచ్‌సీయూ బస్ డిపో నుంచి ఒక రోజు కోసం రెంట్ తీసుకుని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేశారని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఎక్కితే దోశలా అవుతారంటూ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామంటూ సజ్జనార్ ప్రకటించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. సెలబ్రెటీల ముసుగులో ఆర్టీసీని కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

ఇదిలాఉంటే.. ర్యాపిడో రూపొందించిన యాడ్‌లో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసి చూపించడం, కించపరచడాన్ని తప్పుబడుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. అల్లు అర్జున్‌తో పాటు ఈ యాడ్‌ రూపొందించిన ర్యాపిడో కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోన్న టీఎస్‌ఆర్‌టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు, అభిమానులు ఎవరూ సహించరని ఆయన ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

Also read:

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Pneumonia: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? న్యుమోనియా ఉన్నట్లే..!

Flames from Borewell: బోర్ వెల్ నుంచి మంటలు.. 22 రోజులు గడిచినా ఆగలేదు.. ప్రమాదం లేదంటున్న ఓఎన్జీసీ అధికారులు!

Latest Articles