AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: కాస్త ఓపిక ఉంటే చాలు.. లక్షలు సంపాదించుకోవచ్చు! మీ తలరాత మార్చేసే బిజినెస్‌ ఐడియా

తక్కువ పెట్టుబడితో నాటు కోడి పెంపకం వ్యాపారం అధిక లాభాలు తెచ్చిపెట్టగలదు. ప్రస్తుత ఆరోగ్య స్పృహ నేపథ్యంలో నాటు కోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం షెడ్, దాణా, కోడి పిల్లలతో ఈ వ్యాపారం మొదలుపెట్టి, ఓపికతో పెంపకం చేపడితే లక్షలు సంపాదించవచ్చు.

Business Ideas: కాస్త ఓపిక ఉంటే చాలు.. లక్షలు సంపాదించుకోవచ్చు! మీ తలరాత మార్చేసే బిజినెస్‌ ఐడియా
Indian Currency 7
SN Pasha
|

Updated on: Nov 21, 2025 | 9:15 AM

Share

చాలా మందికి మంచి బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉంటుంది. భారీగా డబ్బు సంపాదించాలనే కలతో బిజినెస్‌ మొదలుపెడితే సక్సెస్‌ అయ్యే అవకాశం చాలా తక్కువ. అలా కాకుండా.. పనిని ప్రేమిస్తూ ఏ బిజినెస్‌ చేసినా సక్సెస​ అవ్వొచ్చు. తక్కువ పెట్టుబడితో కాస్త ఓపికగా చేస్తే మిమ్మల్ని లక్షాధికారులను చేసే ఓ బిజినెస్‌ ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. మంచి హెల్తీ ఫుడ్‌ తినాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా జిమ్‌ చేసే వారు ప్రొటీన్‌ కోసం చికెన్‌ ఎక్కువగా తింటారు. అయితే బ్రాయిలర్‌ కోళ్ల కంటే నాటు కోళ్లు తింటే ఇంకా ఎక్కువ హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి. అలా రుచి కూడా వేరే లెవల్‌ ఉంటుంది. అందుకే చాలా మంది నాటుకోళ్లు తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పైగా బ్రాయిలర్‌తో పోలిస్తే.. డిమాండ్‌, ధర రెండు కూడా నాటు కోళ్లకు ఎక్కువే.

ఇప్పుడు ఇదే డిమాండ్‌ను మీరు బిజినెస్‌గా మార్చుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో జస్ట్‌ చిన్న షెడ్‌, దాణా, కోడి పిల్లల కోసం కొంత డబ్బు సమకూర్చుకొని ఈ వ్యాపారం మొదలుపెట్టొచ్చు. అయితే ఈ బిజినెస్‌ చేయడానికి డబ్బు కంటే ముఖ్యంగా ఓపిక కావాలి. కోళ్లను పెంచాలంటే వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మంచి సైజ్‌కు వచ్చిన తర్వాత వాటిని మంచి ధరకు అమ్మొచ్చు. పల్లెటూర్లలో పెంపకం ఈజీగా ఉంటుంది. అయితే సిటీల్లో కూడా ఇంటి మేడపై ఒక్క షెడ్‌ ఏర్పాటు చేసుకొని కోళ్ల పెంపకం చేపట్టవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us