AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మస్క్‌ మామ భవిష్యవాణి.. పేదరికం లేకుండా చేసే సత్తా AIకి ఉంది..! ఎవరూ పని చేయాల్సిన అవసరం ఉండదు!

ఎలాన్ మస్క్ ప్రకారం AI టెక్నాలజీ ఉద్యోగాలను తొలగించదు, బదులుగా ప్రపంచ పేదరికాన్ని అంతం చేస్తుంది. AI, రోబోటిక్స్ ప్రతి ఒక్కరికీ అవసరమైనవన్నీ అందించి, ప్రజలను ధనవంతులుగా మారుస్తుందని ఆయన వాదించారు. పేదరికం అనేది ఇంజనీరింగ్ సమస్య అని, AI ద్వారా దానికి పరిష్కారం లభిస్తుందని మస్క్ పేర్కొన్నారు.

మస్క్‌ మామ భవిష్యవాణి.. పేదరికం లేకుండా చేసే సత్తా AIకి ఉంది..! ఎవరూ పని చేయాల్సిన అవసరం ఉండదు!
Elon Musk Ai
SN Pasha
|

Updated on: Nov 21, 2025 | 7:25 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వల్ల తగినంత ఉద్యోగాలు ఉండవని, అన్ని రంగాలలో ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతారనే భయం అందరిలో ఉంది. కానీ AI ప్రజల ఉద్యోగాల సమస్యను పరిష్కరిస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వాదిస్తున్నారు. రాబోయే 10-20 సంవత్సరాలలో మానవులకు అవసరమైన ప్రతిదాన్ని చూసుకునేలా AI అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన అమెరికా-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. AI ఆవిష్కరణల వల్ల ప్రపంచంలో పేదరికం ఉండదని అన్నారు.

NVIDIA CEO జెన్సెన్ హువాంగ్‌తో జరిగిన ప్యానెల్‌లో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. మానవులకు AI వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పేదరికాన్ని నిర్మూలించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అనేక NGOలు విఫలమయ్యాయి. పేదరికాన్ని నిర్మూలించడానికి ఏకైక మార్గం సాంకేతికత ద్వారానే. AI, రోబోలు మానవ పేదరికాన్ని నిర్మూలించగలవు. ప్రతి ఒక్కరినీ ధనవంతులుగా చేయడానికి ఏకైక మార్గం AI, రోబోటిక్స్ ద్వారానే అని ఎలోన్ మస్క్ అన్నారు.

పేదరికం సామాజిక సమస్య కాదు, అది ఒక ఇంజనీరింగ్ సమస్య. ఈ ఇంజనీరింగ్ సమస్యను AI, రోబోటిక్స్ ద్వారా పరిష్కరించవచ్చని ఎలాన్ మస్క్ వివరించారు. భవిష్యత్తులో AI, రోబోలు అన్ని ఉత్పాదక పనులను చేస్తాయి. అవి ప్రజలకు అవసరమైన ప్రతిదాన్ని అందిస్తాయి. ప్రజలు పని చేయవలసిన అవసరం ఉండదు. సమయం గడపడానికి వారు క్రీడలు లేదా మరేదైనా చేయవచ్చు. ప్రతిదీ సులభంగా అందుబాటులో ఉన్నప్పుడు, డబ్బు అవసరం ఉండదు అని ఎలోన్ మస్క్ అన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us