Investments: మార్చి 31 డెడ్ లైన్.. ఆలోపు ఈ పని చేయకపోతే జరిమానా కట్టాల్సిందే..
కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీపీఎఫ్, ఎన్‌పీఎస్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నారా.. అయితే మార్చి 31లోపు మీరు ఖచ్చితంగా ఈ పని చేయల్సిందే. లేకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవ్వడంతో పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని ముందే గమనించాలి.

మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ది యోజన, నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే మీకు బిగ్ అలర్ట్. మార్చి 31వ తేదీలోపు మీరు మినిమం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే మీ అకౌంట్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది. దీంతో మార్చి 31లోపు తప్పకుండా చెల్లించండి. ఆ తర్వాత మీరు భారీగా జరిమానాలతో పాటు అకౌంట్ కూడా ఇనాక్టివ్ అవుతుంది. ఏయే స్కీమ్‌లో మినిమం డిపాజిట్ ఎంతవరకు చెల్లించాలి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పీపీఎఫ్ స్కీమ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల ద్వారా అకౌంట్ సులువుగా ఓపెన్ చేయవచ్చు. సంవత్సరానికి మినిమం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అకౌంట్‌ను ఇనాపరేటివ్‌గా పరిగణిస్తారు. అకౌంట్ ఆగిపోతే లోన్, విత్‌త్రా సౌకర్యాలు ఆగిపోతాయి. ఒక్కసారి ఇనాక్టివ్ అయితే మళ్లీ యాక్టివ్ చేసుకునేందుకు ఏడాదికి రూ.50 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
సుకన్య సమృద్ది యోజన
ఇక ఈ పెట్టుబడి అకౌంట్ ఉన్నవారు ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో రూ.250 తప్పనిసరిగా జమ చేయాలి. లేకపోతే రూ.50 జరిమానా పడుతుంది. అంటే రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అకౌంట్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. అకౌంట్ ఇనాక్టివ్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఆర్దిక సంవత్సరం ముగిసే మార్చి 31లోపు మినిమం అమౌంట్ జమ చేయండి
నేషనల్ పెన్షన్ సిస్టమ్
ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కనీసం ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో మినిమం డిపాజిట్ రూ. వెయ్యి జమ చేయాల్సి ఉంటుంది. మార్చి 31లోపు చేయకపోతే ఆ తర్వాత ఖాతా ఇనాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మినిమం డిపాజిట్ వేయకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా నిలిచిపోతాయి. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర బీమా పథకాలకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల్లో లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. వీటి ద్వారా లక్షల మందికి ఆర్ధిక, ఆరోగ్య భద్రత లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కావడంతో భద్రత ఉంటుందనే కారణంతో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడితో వీటిని కొనసాగించవచ్చు. గరిష్టంగా ఎంతవరకైనా వీటిల్లో డబ్బులు పొదపు చేసుకోవచ్చు. వీటిల్లో దీర్ఘకాలంలో ఆదాయం కూడా అధికంగా లభిస్తుంది.
