Post Office: పోస్టాఫీస్ మంచి పథకం.. పన్ను మినహాయింపు సహా 2 లక్షల వడ్డీ.. ఈ స్కీమ్ వివరాల్లోకి వెళ్తే..
నేటి యుగంలో ప్రతి పెట్టుబడిదారుడు సురక్షితమైన పెట్టుబడితో పాటు మంచి రాబడిని పొందాలని కోరుకుంటాడు. అటువంటి పరిస్థితిలో మీరు వడ్డీ నుండి మాత్రమే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ లాభం పొందగల పోస్టాఫీస్ పథకం గురించి తెలుసుకుందాం.. ఇది మాత్రమే కాదు, ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు కూడా పొందుతారు.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని డబ్బు సురక్షితంగా, రాబడి కూడా బాగా ఉండే చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అటువంటి వారికి పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పథకం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీనిలో పెట్టుబడి పెట్టడం వలన డబ్బు సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు పెట్టుబడిపై 7.5 % వరకు వడ్డీని కూడా పొందుతారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. ఈ పథకంలో ఐదు సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. వడ్డీ ద్వారా రూ . 2 లక్షల వరకు సంపాదించవచ్చు. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం:
ప్రత్యేకత ఏమిటి? పిల్లలు, చిన్నవారు లేదా పెద్దలు, ప్రతి ఒక్కరూ పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనిలో కనీసం రూ. 1,000 తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. అయితే పెట్టుబడి కాలం ఎంత ఎక్కువగా ఉంటే.. పొదుపుపై మంచి వడ్డీ రేటు లభిస్తుంది.
2 లక్షల రూపాయల వడ్డీ ఎలా పొందుతారంటే ఎవరైనా ఈ పథకంలో 5 లక్షల రూపాయలు 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే.. అతనికి 7.5 % వడ్డీ లభిస్తుంది. అంటే 5 సంవత్సరాలలో దాదాపు రూ. 2,24,974 వడ్డీగా పొందుతాడు. అంటే 5 లక్షల పెట్టుబడికి 2 లక్షల రూపాయలకు పైగా వడ్డీ ద్వారా లభిస్తుంది. అసలు.. వడ్డీ.. ఈ మొత్తాన్ని కలిపితే.. ఐదేళ్ళలో ఈ పథకం ద్వారా రూ. 7,24,974 లు పొందనున్నారు.
కాలపరిమితి ప్రకారం వడ్డీ రేటు ఈ పథకంలో ఎవరైనా 1 సంవత్సరం పెట్టుబడి పెడితే 6.9% వడ్డీ లభిస్తుంది. అదే 2 లేదా 3 సంవత్సరాలు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 7% ఉంటుంది. అదే 5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే గరిష్ట ప్రయోజనం పొందుతారు. అంటే 7.5% వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు.
పన్ను మినహాయింపు ప్రయోజనం ఈ పథకం మరో పెద్ద గొప్ప విషయం ఏమిటంటే.. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందుతారు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పెట్టుబడి మొత్తం వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన పన్నును ఆదా చేసుకోవచ్చు. డబ్బును పెంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








