India Post: పెట్టుబడికి ఈ ప్రభుత్వ పథకం చాలా బెస్ట్.. ప్రతి నెలా మీకు ఆదాయం గ్యారెంటీ.. వడ్డీ రేటు, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల్లో నెలవారీ ఆదాయ పథకాన్ని (MIS)కూడా చేర్చారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి నెల కొంత ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది.
Post Office Monthly Income Scheme: మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే స్కీమ్‌ను పరిశీలించాల్సిందే. పోస్టాఫీసు పొదుపు పథకాలను ఇందుకు బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఈ పథకాల్లో మీరు ఖచ్చితంగా మంచి రాబడులు పొందుతారు. అలాగే, ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బు కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ డిపాజిట్లయితే మీరు కేవలం రూ. 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ, పోస్టాఫీసులో అలా కాదు. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో పెట్టుబడిని చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు.
పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల్లో నెలవారీ ఆదాయ పథకం (MIS) కూడా చేర్చారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ప్రతి నెల సంపాదించే అవకాశాన్ని పొందుతారు. ఇందులో, ప్రతి నెలా మీ ఖాతాలో నిర్ణీత మొత్తం వస్తుంది. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS) గురించి వివరంగా తెలుసుకుందాం.
వడ్డీ రేటు పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ప్రస్తుతం సంవత్సరానికి 6.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. నెలవారీ వడ్డీగా చెల్లించనున్నారు.
పెట్టుబడి మొత్తం ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో రూ .1000 తో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి మొత్తం ఒకే ఖాతాలో రూ. 4.5 లక్షలు, అలాగే ఉమ్మడి ఖాతాలో రూ .9 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ. 4.5 లక్షలు పొందవచ్చు. ప్రతి ఉమ్మడి హోల్డర్‌కు ఉమ్మడి ఖాతాలో సమాన వాటా ఉంటుంది.
ఖాతా ఎవరు తెరవొచ్చు? పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో ఎవరైనా ఖాతా తెరవచ్చు. ఒక వయోజనుడు, ముగ్గురు పెద్దలు కలిసి ఓ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. మైనర్ తరపున ఖాతా తెవవాలంటే మాత్రం కచ్చితంగా గార్డియన్‌గా పెద్దవారు కచ్చింగా ఉండాలి.
ఖాతా మెచ్యూరిటీ.. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. ఆ తరువాత ఖాతాను మూసివేయడానికి సంబంధిత పోస్టాఫీసుకు పాస్‌బుక్‌తో పాటు తగిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.
మెచ్యూరిటీకి ముందు అకౌంట్ హోల్డర్ చనిపోతే, అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. అప్పుడు అందులో మొత్తం నామినీ లేదా చట్టపరమైన వారసుడికి తిరిగి ఇవ్వబడుతుంది. రీఫండ్ చేసిన నెల ముందు నుంచి వడ్డీ చెల్లిస్తారు.
అకౌంట్ క్లోజింగ్ డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం గడువులోగా అకౌంట్‌ను మూసివేసే అవకాశం ఉంది. అయితే ఇందుకుగాను ఎటువంటి ఛార్జీలు వసూళ్లు చేయరు.
ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత లేదా మూడేళ్ల ముందు క్లోజ్ చేస్తే మాత్రం ప్రిన్సిపల్ అమౌంట్‌లో 2 శాతానికి సమానమైన మొత్తం తీసివేస్తారు. అలా తీసేసిన తరువాత మిగిలిన మొత్తాన్ని ఖాతాదారునికి చెల్లిస్తారు.
ఖాతా తెరిచిన తేదీ నుంచి మూడేళ్ల తర్వాత లేదా ఐదేళ్ల ముందు క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం ప్రిన్సిపల్ అమౌంట్‌లో 1 శాతానికి సమానమైన మొత్తాన్ని కోత కోయనున్నారు. ఆ తరువాత మిగిలిన మొత్తాన్ని చెల్లించనున్నారు.
సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌తో పాటు తగిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, మెచ్యూరిటీకి ముందు ఖాతాను మూసివేయవచ్చు.
Also Read: Dasara Special Offer: మహిళలకు దసరా స్పెషల్.. రూ. 50 లకే కొత్త చీర.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే..?
Indian Railways: మనం పట్టించుకోం కానీ బాబోయ్.. మన రైలు ప్రయాణాలలో ఇబ్బందుల లెక్క చూస్తే మతి పోతుంది!