Forbes – Reliance: మరో ఘనత సొంతం చేసుకున్న రిలయన్స్.. ప్రపంచ బెస్ట్ ఎంప్లాయర్ కంపెనీగా రికార్డు..
Forbes world's top 100 best employers list: రిలయన్స్ సంస్థ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ ఎంప్లాయర్ కంపెనీగా రిలయన్స్ సంస్థ నిలిచింది. బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్
Forbes world’s top 100 best employers list: రిలయన్స్ సంస్థ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ ఎంప్లాయర్ కంపెనీగా రిలయన్స్ సంస్థ నిలిచింది. బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్-2021 రిపోర్టును వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ అత్యుత్తమ యాజమాన్యాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు భారతదేశంలోని 19 కంపెనీలకు చోటు లభించింది. అయితే.. వంద ర్యాంకుల్లో భారత్ నుంచి నాలుగు కంపెనీలకు చోటు లభించింది. మొదటి స్థానంలో.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అత్యుత్తమ యాజమాన్య కంపెనీగా నిలిచింది. అయితే.. ప్రపంచ స్థాయిలో రిలయన్స్ 52వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే.. ఈ జాబితాలో ప్రపంచంలోని 750 పెద్ద కంపెనీలను చేర్చారు.
ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం 19 కంపెనీలకు చోటు లభించింది. టాప్ 100 కంపెనీల్లో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీలలో ఐసీఐసీఐ బ్యాంక్ 65 వ స్థానంలో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 77, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 90 వ స్థానంలో నిలిచాయి. అలాగే, ఎస్‌బీఐకి 119, లార్సన్ అండ్ టుర్బో 127, బజాజ్ 215, యాక్సిస్ బ్యాంక్ 254, ఇండియన్ బ్యాంక్ 314, అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ 404, అమర్‌రాజా 405, కోటక్ మహీంద్రా బ్యాంక్ 418, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్ ఆఫ్ బరోడా 496, ఎల్‌ఐసీ 504, ఇన్ఫోసిస్ 588, టాటా గ్రూప్ 746 స్థానాల్లో నిలిచినట్లు ఫోర్బ్స్ సంస్థ నివేదికలో వెల్లడించింది.
కాగా… దక్షిణ కొరియా కంపెనీ శామ్‌సంగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ యజమాని కంపెనీగా నిలిచింది. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్-2021 జాబితాలో మొదటి స్థానంలో నిలిచి శామ్సంగ్ రికార్డును సొంతం చేసుకుంది. కాగా.. రెండు నుంచి 7 వ స్థానాల్లో అమెరికన్ కంపెనీలు నిలిచాయి. వీటిలో ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమేజాన్, యాపిల్, ఆల్ఫాబెట్, డెల్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. 8 వ స్థానంలో హువాయ్, 9వ స్థానంలో అడోబ్, జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ 10వ స్థానంలో నిలిచింది.
Also Read: