Dasara Special Offer: మహిళలకు దసరా స్పెషల్.. రూ. 50 లకే కొత్త చీర.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే..?

Dasara Special Offer: మగువలకు చీరలకు విడదీయరాని బంధం ఉంది. ఎన్ని రకాల దుస్తులు, చీరలు ఉన్నా.. పండగకు, ఫంక్షన్లకు వచ్చిందంటే..

Dasara Special Offer: మహిళలకు దసరా స్పెషల్.. రూ. 50 లకే కొత్త చీర.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే..?
Dasara Special Offer

Dasara Special Offer: మగువలకు చీరలకు విడదీయరాని బంధం ఉంది. ఎన్ని రకాల దుస్తులు, చీరలు ఉన్నా.. పండగకు, ఫంక్షన్లకు వచ్చిందంటే.. ఏ చీర కట్టుకోవాలి.. అని ఆలోచిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే.. మగువలను ఆకట్టుకున్న బట్టల షాపులు నిత్యం రద్దీతో కలకాలాడతాయి. వ్యాపారం కూడా బాగా సాగుతుందనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో స్తీలను ఆకర్షించడానికి పలు బట్టల దుకాణాలు ఆషాడం సేల్స్, శ్రావణ మాసం సేల్స్. ఇయర్ ఎండింగ్ క్లియరెన్స్ సేల్స్ అంటూ రాకరాక ఆఫర్స్ ను ప్రకటిస్తారు. తాజాగా ఓ షో రూమ్ లో దసరా స్పెషల్ ఆఫర్ .. 50 రూపాయలకే కొత్త చీర ఇస్తామని ప్రకటించారు. ఇంకేముందు .. ఆ షాపు ముందు మహిళలు బారులు తీరారు.. కిలోమీటర్లమేర నిల్చుని పడిగాపులు గాచారు.. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రంలోని తేంకాసి జిల్లాలో దసరా సందర్భంగా నూతనంగా కార్తీక వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభిత్సవ కానుకగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది కార్తీక బట్టల యాజమాన్యం. మొదటి రోజున తమ షాపులో చీరలను కేవలం రూ. 50 లకే అందించనున్నామని ప్రకటించింది.

దీంతో మహిళలు.. కరోనా నిబంధనలను పక్కకు పెట్టి.. ఆఫర్లో వచ్చే చీరల కోసం.. షాపుకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో స్త్రీలు కిలోమీటర్ల దూరంలో క్యూ లో నిలబడి.. పడిగాపులు గాశారు.  ఈ సందర్భంగా మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఇక భారీగా క్యూ ఉండడంతో ఎండకు క్యూ లైన్ లో మహిళలు సొమ్మసిల్లిపోయారు.

 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను అదుపుచేయడానికి అష్టకష్టాలు పడ్డారు. మరోవైపు షాపు యజమానిపై కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ అధికారులు కేసు నమోదు చేశారు.

Also Read: కళ్ళకు విశ్రాంతి లేదా.. ఎర్రగా మారి దురదలు పెడుతున్నాయా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu