Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్‌ 14వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా..? ఇందులో మీ పేరు ఉందో లేదో చూసుకోండిలా..!

రైతులకు మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని చాలా మంది రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ స్కీమ్‌..

PM Kisan: పీఎం కిసాన్‌ 14వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా..? ఇందులో మీ పేరు ఉందో లేదో చూసుకోండిలా..!
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: May 14, 2023 | 2:50 PM

రైతులకు మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని చాలా మంది రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ ద్వారా రైతులు 13వ విడత వరకు డబ్బులు అందుకోగా, ఇప్పుడు 14వ విడత విడుదల కానుంది. నివేదికల ప్రకారం మే చివరి వారంలో అర్హులైన లబ్ధిదారులకు రూ .2,000 విడుదల చేయనున్నట్లు సమాచారం. దీని గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కొన్ని మీడియా నివేదికల నుంచి వచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ నివేదించింది. ఫిబ్రవరిలో కేంద్రం 13వ విడత నిధులు విడుదల చేసింది. బెల్గామ్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన 13విడత సొమ్ము విడుదలైన విషయాన్ని ఆయన ప్రకటించారు . ఇప్పుడు 14వ భాగం విడుదలకు సమయం ఆసన్నమైంది .

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019 లో ప్రారంభమైంది . వ్యవసాయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది. సంవత్సరానికి ఒకసారి చెల్లించే బదులు 3 వాయిదాలలో నిధులు అందిస్తోంది కేంద్రం. అంటే ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి మూడు విడతలుగా రూ .2000 జమ చేస్తుంది. కర్నాటక రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వాయిదాలు జత చేస్తుంది. అంటే రాష్ట్ర రైతులకు ఏడాదికి రూ .10,000 అందుతుంది .

మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో లబ్దిదారుని అయితే ఎలా తనిఖీ చేయాలి ?

  • మీరు ఇప్పటికే పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకున్నట్లయితే , మీరు ఈ కింది దశల ద్వారా లబ్ధిదారుని స్థితిని తెలుసుకోవచ్చు.
  • పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించండి. లబ్దిదారుల స్థితిని చూడవచ్చు.
  • ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ , PM కిసాన్ ఖాతా నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
  • క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి , డేటా కోసం క్లిక్‌ చేయండి.
  • అప్పుడు మీ లబ్ధిదారుడి స్థితి ఏమిటో తెలుస్తుంది .

పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ?

  • పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • రైతుల కార్నర్‌లో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి
  • అక్కడ మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
  • ఆ గ్రామంలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులందరి జాబితా ప్రదర్శించబడుతుంది.
  • ఈ జాబితాలో మీ పేరు ఉందని నిర్ధారించండి.

పీఎం కిసాన్ యోజన కోసం ఎలా నమోదు చేసుకోవాలి ?

PM కిసాన్ పథకం యొక్క లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకుంటే లేదా మీరు మొదటి సారి పథకంలో నమోదు చేసుకుంటే ఇది ఆన్‌లైన్‌లో చేయవచ్చు .

ఇవి కూడా చదవండి
  • PM కిసాన్ యోజన వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • అక్కడ ఫార్మర్ కార్నర్‌లో ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయండి
  • అక్కడ అవసరమైన వివరాలను పూరించండి.
  • మీరు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు .
  • ఆన్‌లైన్‌లో కాకుండా, రైతులు సమీపంలోని రైతు కేంద్రానికి వెళ్లి అక్కడ సిబ్బంది ద్వారా పీఎం కిసాన్ యోజన కోసం కొత్తగా నమోదు చేసుకోవచ్చు .
  • ఆధార్ కార్డు, భూమి దస్తావేజు ప్రధానంగా అవసరం. పథకం లబ్ధిదారులు భూమి యజమానులు అయి ఉండాలి. భూమి లేని వ్యవసాయ కూలీలు అయితే ఈ పథకం వర్తించదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి