AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. త్వరలో పదో విడత కిసాన్ యోజన సొమ్ము మీ అకౌంట్లో.. అందులో మీ పేరు ఉందా? చెక్ చేసుకోండిలా!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 10వ విడత సొమ్ములు రైతుల బ్యాంకు ఎకౌంట్లలోకి విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి.

PM Kisan: రైతులకు శుభవార్త.. త్వరలో పదో విడత కిసాన్ యోజన సొమ్ము మీ అకౌంట్లో.. అందులో మీ పేరు ఉందా? చెక్ చేసుకోండిలా!
KVD Varma
| Edited By: |

Updated on: Nov 27, 2021 | 5:57 PM

Share

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 10వ విడత సొమ్ములు రైతుల బ్యాంకు ఎకౌంట్లలోకి విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. రాబోయే రెండు మూడు వారాల్లో పిఎం కిసాన్ (PM Kisan10th phase) 10వ విడతను ప్రభుత్వం విడుదల చేయనుంది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఇప్పటి వరకు 9 వాయిదాలు అందాయి. చివరిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 9, 2021న రైతుల ఖాతాకు డీబీటీ(DBT) ద్వారా 9వ వాయిదా సొమ్మును పంపారు.

10వ విడత పీఎం కిసాన్‌కు అవసరమైన ప్రక్రియ పూర్తయిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ డిసెంబర్ 15న రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్ 25న కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ప్రధాని విడుదల చేశారు. ఒకవేళ ఈసారి కూడా అదే తేదీన నగదు బదిలీ చేసినా.. కొత్త ఏడాదికి ముందే రైతులకు 2000 రూపాయలు అందనున్నాయి.

ఇప్పటివరకూ 9 విడతలు..

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు మూడు విడతలుగా 2,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్రం నుంచి నేరుగా రైతుల ఎకౌంట్లలోకి డబ్బులు జమ అయిపోతాయి. పీఎం కిసాన్ 9వ విడతలో రైతులకు మొత్తం 19,500 కోట్ల రూపాయలు అందించారు.

పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 9 వాయిదాలు విడుదలయ్యాయి. 8వ విడతలో అత్యధిక రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన డేటా ప్రకారం, ఏప్రిల్-జూలై, 2021-22కి విడుదల చేసిన 8వ విడత కింద మొత్తం 11 కోట్ల 09 లక్షల 85 వేల 633 మంది రైతులు ఒక్కొక్కరూ 2000 రూపాయలు పొందారు. అదే సమయంలో, మొదటి విడత ప్రయోజనం చాలా తక్కువ మంది లబ్ధిదారులకు అందింది. అప్పుడు కేవలం 3 కోట్ల 16 లక్షల 08 వేల 754 మంది రైతులకు మాత్రమే డబ్బులు వచ్చాయి.

మీరు మీ పేరును ఇలా చెక్ చేసుకోవచ్చు

పేరును తనిఖీ చేయడానికి, మీరు PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ కుడి వైపున లబ్ధిదారుల జాబితా ఎంపిక ఉంటుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా, మీరు మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం మొదలైన సమాచారాన్ని నమోదు చేసి, గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే, అన్ని పేర్ల జాబితా కనిపిస్తుంది. మీరు మీ పేరును ఇక్కడ తనిఖీ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి: Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే.. 

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..