Two Wheeler: ద్విచక్ర వాహనాలను ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తే మంచిదా.? కాదా..? నిపుణులు ఏమంటున్నారంటే..!

Two Wheeler: ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వాహనాల తయారీ కంపెనీలు పలు ఆఫర్లు విధిస్తున్నాయి. ద్విచక్ర..

Two Wheeler: ద్విచక్ర వాహనాలను ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తే మంచిదా.? కాదా..? నిపుణులు ఏమంటున్నారంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 27, 2021 | 12:52 PM

Two Wheeler: ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వాహనాల తయారీ కంపెనీలు పలు ఆఫర్లు విధిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై చాలా సంస్థలు ఈఎంఐ రూపంలో అందిస్తున్నాయి. వాహనాలపై రుణాలు ఇస్తున్నాయి. సాధారణంగా రోజువారీ అవసరాల కోసం బైక్‌ తప్పనిసరి. ద్విచక్ర వాహనాల్లో 100 సీసీ, 150సీసీలతో పాటు ఇంకా ఎక్కువ సీసీలో లభ్యమవుతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నారు. కార్లతో పోలిస్తే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రుణ సాయం తీసుకునే వారి సంఖ్య పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఫైనాన్స్‌లో వాహనాలు తీసుకుంటే ఎలా ఉంటుందనేదానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం తీసుకుంటే ఈఎంఐని ఎంచుకుంటే బైక్‌కు ఉండే ధర మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈఎంఐలో ఎక్కువ ధర ఉండే మంచి బైక్‌ అయినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు వాహనదారులు. నెలవారీ వాయిదాల పద్దతుల్లో చెల్లించడం వల్ల మీకు పెద్దగా ఆర్థిక ఇబ్బందులున్నట్లు అనిపించదు. బైక్‌ తీసుకుంటే ఒకేసారి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈఎంఐలో తీసుకుంటే ప్రతి నెల కొంత సొమ్మును పక్కనపెట్టాల్సి ఉంటుంది.

తక్కువ వడ్డీరేట్లు..

ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే వాహనాలకు రుణాలు అందిస్తున్నాయి. ప్రాసెసింగ్‌ ఫీజులు కూడా మాఫీ చేస్తున్నాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న దృష్ట్యా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. ఇక పండగ సీజన్‌లో అయితే వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తున్నాయి. ఇటీవల దసరా, దీపావళి పండగ సీజన్‌లో భారీగా వడ్డీ రేట్లను తగ్గించాయి. అంతేకాదు ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఫీజులను సైతం రద్దు చేశాయి. సాధారణంగా ద్విచక్ర వాహనం తీసుకుంటే 7-18 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. మీరు ఎంచుకున్న బ్యాంకు, రుణ కాలపరిమితి, క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి రేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.

ప్రతినెల ద్విచక్ర వాహనం కోసం ఈఎంఐ చెల్లించేందుకు కొంత మొత్తం పొదుపు చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక వేళ మీరు ప్రతి నెల సరిగ్గా ఈఎంఐ చెల్లించకుంటే అధిక పెనాల్టీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. దీని వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఎంఎంఐ ఎంచుకుంటే ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే బాగుంటుంది. ఇలా చెల్లించడం వల్ల మున్ముందు మీకు మరిన్ని రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

గంటల్లోనే రుణాలు..

పత్రాలు, బ్యాంకు రూల్స్‌ను చూసి కొంత మంది రుణం తీసుకునేందుకు వెనుకంజ వేస్తుంటారు. ఒకప్పుడు బ్యాంకు రుణం కావాలంటే బ్యాంకు చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆన్‌లైన్‌లోనే రుణాలను అందిస్తున్నాయి సంస్థలు. అన్ని అర్హతలు ఉండి ఆన్‌లైన్‌లోనే పత్రాలు సమర్పిస్తే వెంటనే రుణం మంజూరు అయి మీ అకౌంట్లో క్రెడిట్‌ అవుతాయి. అయితే కొన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే గంటల్లోనే రుణాలు ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. అలాంటి సంస్థలతో మీరు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Fixed Deposit: మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.. పూర్తి వివరాలు..!

Recharge Plans: మొబైల్‌ యూజర్లకు షాక్‌.. పెరిగిన ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ ధరలు.. పూర్తి వివరాలు