AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే..

దేశ రాజధానిలో శుక్రవారం టమాటా రిటైల్ ధర కిలో రూ.75కి చేరగా, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ధరలు తగ్గాయి.

Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే..
Tomato Price
KVD Varma
|

Updated on: Nov 26, 2021 | 9:30 PM

Share

Tomato Price: దేశ రాజధానిలో శుక్రవారం టమాటా రిటైల్ ధర కిలో రూ.75కి చేరగా, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ధరలు తగ్గాయి. కానీ, ఇంకా అందుబాటు ధరల్లోకి మాత్రం రాలేదు. సెంచరీ దాటిన టమాటా ధర ఈరోజు(నవంబర్ 26) కొద్దిగా కిందికి దిగివచ్చింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, చెన్నైలో నవంబర్ 22న ఆల్ టైమ్ గరిష్టంగా రూ.100 ఉన్న టొమాటో ధర శుక్రవారం రూ.63కి తగ్గింది. అదేవిధంగా తిరువనంతపురంలో కిలో ధర రూ.103 నుంచి రూ.80కి తగ్గింది.

నవంబరు 22న కిలో రూ.100 ఉన్న టమాటా ధరలు శుక్రవారం పుదుచ్చేరిలో కిలో రూ.45కి తగ్గాయి. అయితే హైదరాబాద్‌లో గతంలో కిలో రూ.90 ఉన్న ధర రెండు రోజుల్లో స్వల్పంగా తగ్గి 72కి చేరుకుంది. బెంగళూరులో, రిటైల్ మార్కెట్‌లో టొమాటో ధరలు కిలో గరిష్టంగా 88 వద్ద ఉన్నాయి. పోర్ట్ బ్లెయిర్‌లో నవంబర్ 22న కిలో 113గా ఉన్న ధర శుక్రవారం నాటికి రూ.143కి పెరిగింది.

ఢిల్లీలో..

డేటా ప్రకారం, దేశ రాజధానిలో నవంబర్ 22న కిలో రూ.63గా ఉన్న టమాటా రిటైల్ ధర శుక్రవారం రూ.75కి పెరిగింది. అయితే, ఢిల్లీలో ఉల్లిపాయలు, బంగాళదుంపల రిటైల్ ధరలు తగ్గాయి. చిల్లరగా కిలో ఉల్లి ధర రూ.35, బంగాళదుంప రూ.20 పలుకుతోంది.

టమాటా రిటైల్‌ ధరలు భారీగా పెరిగాయి

నవంబర్ మొదటి వారం నుంచి విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో టమాటా రిటైల్ ధరలు భారీగా పెరిగాయి. భారీ వర్షాల కారణంగా టమోటా పంట దెబ్బతినడంతో సరఫరా పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు టమోటా సరఫరా కూడా ప్రభావితమైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, నవంబరు 22న కిలోకు రూ.113గా ఉన్న టమాటా సగటు అఖిల భారత గరిష్ట రిటైల్ ధర శుక్రవారం రూ.143కి పెరిగింది.

ప్రస్తుతానికి ధర పెరుగుతూనే ఉంటుంది

ఇదిలావుండగా, అధిక వర్షాల కారణంగా కూరగాయల ధరలు పెరిగాయని, వచ్చే రెండు నెలల పాటు ధరల పెరుగుదల కొనసాగుతుందని క్రిసిల్ రీసెర్చ్ శుక్రవారం తెలిపింది. టమాటా ఎక్కువగా పండే ప్రాంతాల్లో ఒకటైన కర్ణాటక పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కూరగాయలను పంపిస్తున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Vladimir Putin: భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలకం కానున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక చర్చలు

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..