AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata: ముంబై మారణహోమం.. అమరవీరులకు నివాళి అర్పించిన రతన్‌ టాటా..

రిగ్గా 13 ఏళ్ల క్రితం ముంబయిలో జరిగిన ఓ ఉగ్రదాడి భారతదేశంతో పాటు యావత్‌ ప్రపంచాన్ని వణికించింది. దేశ ఆర్థిక రాజధానిని లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడిన ముష్కరులు 164 మందిని బలిగొన్నారు.

Ratan Tata: ముంబై మారణహోమం.. అమరవీరులకు నివాళి అర్పించిన రతన్‌ టాటా..
Basha Shek
|

Updated on: Nov 26, 2021 | 9:27 PM

Share

సరిగ్గా 13 ఏళ్ల క్రితం ముంబయిలో జరిగిన ఓ ఉగ్రదాడి భారతదేశంతో పాటు యావత్‌ ప్రపంచాన్ని వణికించింది. దేశ ఆర్థిక రాజధానిని లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడిన ముష్కరులు 164 మందిని బలిగొన్నారు. ఇందులో భారతీయులతో పాటు విదేశీయులు ఉన్నారు. ఈ మారణహోమం జరిగి నాటికి 13 ఏళ్లు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ దారుణ సంఘటనను గుర్తుచేసుకుంటున్నారు. మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళి అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా ముంబయి 26/11 విషాద ఘటనను తలచుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ముష్కరుల దాడిలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా అప్పటి ఉగ్రదాడుల్లో భారీగా దెబ్బతిన్న తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రతన్‌ టాటా..’13 ఏళ్ల క్రితం మనం అనుభవించిన బాధ ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే ఈ దాడిలో దూరమైన ఆత్మీయులను ఎప్పటికీ తిరిగి పొందలేం. కానీ మనం కోల్పోయిన వారిని గౌరవించడం ద్వారా మనల్ని నాశనం చేయడమే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడుల విషాధ స్మృతులను మన బలంగా మార్చుకోవచ్చు’ అని పిలుపునిచ్చారు.

View this post on Instagram

A post shared by Ratan Tata (@ratantata)

Also Read:

Khewra Salt Mines: అలెగ్జాండర్‌ గుర్రం కనిపెట్టిన అద్భుత పదార్థం.. నేడు వందల కోట్లలో వ్యాపారం..

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..

Post Office: పోస్టాఫీసులో నెలకి 10,000 పెట్టండి..16 లక్షలు పొందండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..