AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: కోట్లాది మంది రైతులకు అలర్ట్‌.. సెప్టెంబర్ 30 సమీపిస్తోంది.. వెంటనే ఈ పని చేసుకోండి

ఇప్పటికే చాలా మంది రైతులు వారివారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండగా, కొందరికి మాత్రం జమ కావడం లేదు. దీంతో వారు ఎందుకు డబ్బులు రావడం లేదనే విషయాన్ని కూడా గమనించడం లేదు. ఎందుకు డబ్బులు పడలేవో అనే విషయాన్ని గమనిస్తే అసలు విషయం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ గురించి పదేపదే హెచ్చరిస్తూ వస్తోంది..

PM Kisan: కోట్లాది మంది రైతులకు అలర్ట్‌.. సెప్టెంబర్ 30 సమీపిస్తోంది.. వెంటనే ఈ పని చేసుకోండి
PM Kisan
Subhash Goud
|

Updated on: Sep 10, 2023 | 11:15 PM

Share

దేశవ్యాప్తంగా రైతులకు ఇది ముఖ్యమైన వార్తేనని చెప్పాలి. మీరు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్నట్లయితే లేదా దానిని తీసుకోవాలనుకుంటే, మీరు సెప్టెంబర్ 30లోపు కొన్ని ముఖ్యమైన పనిని పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 14 వాయిదాల నగదును కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు 15వ విడత డబ్బులు ఇవ్వనుంది. 15వ విడతగా డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేస్తుంది.

15వ విడత ముందు ఈ పని చేయండి

రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లోని ‘ఫేస్ అథెంటికేషన్ ఫీచర్’తో, మారుమూల ప్రాంతాల రైతులు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు OTP లేదా వేలిముద్ర లేకుండా వారి ముఖ ప్రమాణీకరణను పొందవచ్చు .

ఇవి కూడా చదవండి

ఇక్కడ సంప్రదించండి:

మీ ఖాతాలో 14వ వాయిదా డబ్బు ఇంకా రాకపోతే, మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 అలాగే 011-23381092ను ఫోన్ నంబర్ కూడా చేయవచ్చు. లేదా అధికారిక వెబ్ సైట్ ను కూడా సందర్శించి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ఇంకో విషయం ఏంటంటే ఈ పథకానికి సంబంధించిన 15వ విడత దరఖాస్తులు సైతం మొదలయ్యాయి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ఏ రైతు అయినా ఉమ్మడి సేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చుpmkisan.gov.in  కు సందర్శించి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఏడాదికి మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే కొందరు కేవైసీ గానీ, ఇతర వివరాలు సరిపోలని కారణంగా వారి డబ్బులు ఖాతాల్లో పడవు. దీంతో కేంద్ర ప్రభుత్వం వారి డబ్బులను సైతం నిలిపివేస్తుంది.

అందుకే ముందస్తుగా అన్ని వివరాలను సరి చూసుకుని కేంద్రం విధిస్తున్న నిబంధనలు పాటిస్తే డబ్బులు ఖాతాల్లో చేరుతాయని గుర్తించుకోండి. ఇప్పటికే చాలా మంది రైతులు వారివారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండగా, కొందరికి మాత్రం జమ కావడం లేదు. దీంతో వారు ఎందుకు డబ్బులు రావడం లేదనే విషయాన్ని కూడా గమనించడం లేదు. ఎందుకు డబ్బులు పడలేవో అనే విషయాన్ని గమనిస్తే అసలు విషయం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ కే వై సీ గురించి పదే పదే హెచ్చరిస్తూ వస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి