Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు వచ్సేస్తున్నాయి.. కానీ రూల్స్ మారాయి.. తెలుసుకున్నారా ?..

కొత్త నిబంధనల ప్రకారం రైతులు డబ్బులు పొందాలనుకుంటే వారి మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం. వీటి ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు వచ్సేస్తున్నాయి.. కానీ రూల్స్ మారాయి.. తెలుసుకున్నారా ?..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2022 | 9:49 PM

కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ ఖర్చుల కోసం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఇప్పటివరకు 11 విడతల నగదును కేంద్రం రైతులకు అందించింది. ఇక ఇప్పుడు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో 12వ విడత నగదు రానుంది. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ స్కీమ్ రూల్స్ కూడా మారాయి. పీఎం కిసాన్ కొత్త నిబంధనలు ప్రకారం ఇప్పుడు రైతులు ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా మీ స్థితిని చెక్ చేయలేరు. కొత్త రూల్ ద్వారా రైతులు వారి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

కొత్త నిబంధనల ప్రకారం రైతులు డబ్బులు పొందాలనుకుంటే వారి మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం. వీటి ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు పీఎం కిసాన్ పోర్టల్ కు లాగిన్ అయ్యి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ ద్వారా నమోదు చేసేవారు. ఇక గతంలో మొబైల్ నంబర్ సౌకర్యం నిలిపివేశారు. ఆధార్, బ్యాంక్ నంబర్ ద్వారానే స్టేటస్ చెక్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆధార్, బ్యాంక్ నంబర్ కాకుండా.. మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మాత్రమే స్థితిని చెక్ చేసుకోవచ్చు.

మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ తో స్టేటస్ ఎలా చెక్ చేయాలి. ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత మీ స్థితి (స్టేటస్) తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మీ మొబైల్ నంబర్ ద్వారా స్థితిని తనిఖీ చేయాలనుకుంటే మొబైల్ నంబర్ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ని ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డేటా పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎలా కనుగొనాలి? రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోండి అనే లింక్ ఎడమ వైపున కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పీఎం కిసాన్ ఖాతా లింక్ అయినన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పేరు కనిపిస్తాయి.