AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రెండు నెలలే టైమ్

పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. త్వరలో 23వ విడత సొమ్మును కేంద్రం జమ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రధాని మోదీ బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు. ప్రతీసారి ప్రధాని మోదీనే స్వయంగా డబ్బులను విడుదల చేస్తున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రెండు నెలలే టైమ్
Pm Kisan 23rd Installment
Venkatrao Lella
|

Updated on: May 06, 2026 | 6:58 AM

Share

పీఎం కిసాన్‌ 22వ విడత నగదును కేంద్ర ప్రభుత్వం ఇటీవల లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. గువాహటి జరిగిన బహిరంగ సభలో మార్చి 13న ప్రధాని మోదీ నేరుగా ఈ నగదును విడుదల చేశారు. ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ క్రమంలో 23వ విడత సొమ్ము కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అకౌంట్లోకి వస్తాయా అని నిరీక్షిస్తున్నారు. అయితే 23వ విడతపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. జున్ లేదా జులైలో తర్వాత విడత సొమ్మును కేంద్రం రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. 23వ విడత నగదు పొందాలంటే ఆ ఒక్క పని తప్పనిసరిగా చేయాలని రైతులకు సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ పని చేస్తేనే..

ఇక పీఎం కిసాన్ పొందాలంటే తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. 23వ విడత నగదు రానున్న రోజుల్లో డీబీటీ విధానంలో నేరుగా అకౌంట్లో జమ కానున్న క్రమంలో లబ్దిదారులు అందరూ తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌లో మీ ఆధార్ కార్డును లింక్ చేయాలి. ఇక రిజిస్టర్డ్ ఫార్మర్స్ ఈకేవైసీ చేయించుకోవాలి. అయితే ఈకేవైసీ చేసుకోవాలంటే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా స్వయంగా చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ యాప్ ద్వారా కూడా పని పూర్తి చేయవచ్చు. ఇక కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి చేసుకోవచ్చు. ఇలా మూడు మార్గాల్లో పీఎం కిసాన్ లబ్దిదారులు మీ కేవైసీ అనేది సులభంగా పూర్తి చేయవచ్చు.

వీరికి డబ్బులు కట్

ఫిబ్రవరి 1,2019 తర్వాత భూమి కొనుగోలు చేసినవారికి పీఎం కిసాన్ అందదు. ఇక ఇంట్లో ఒకరికి మాత్రమే వస్తుంది. కేంద్రం ఎప్పటికప్పుడు రీవెరిఫికేషన్ చేపడుతోంది. అనర్హులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది. ఈ ఏడాదిలో కూడా అనర్హులుగా తేలినవారికి గుర్తించి వారి పేరును పథకం నుంచి తొలగించింది. దీంతో లబ్దిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2025-26 డిసెంబర్-మార్చి సమయంలో లబ్దిదారుల సంఖ్య 9.46 కోట్లుగా ఉంది. అంతకముందు అంతకముందు ఆగస్ట్-నవంబర్ నెలల్లో 9.35 కోట్లుగా ఉంది. ఇక 2025-26 ఏప్రిల్-జులై సమయంలో 9.71 కోట్లుగా ఉంది. ఇలా లబ్దిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ కొంతమంది పీఎం కిసాన్ లబ్దిదారులుగా ఉన్నారు. దీంతో ఐటీ శాఖ నుంచి వచ్చిన డేటా ఆధారంగా వారిని కేంద్రం తొలగిస్తోంది.

Follow Us