AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM KISAN 20th Installment: రైతన్నలకు అలర్ట్.. పీఎం కిసాన్ నగదు జమకు ముందు బిగ్ అప్డేట్.. 

దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు, అన్నదాతలకు సాయం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు భారత ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించింది.. దీనిలో భాగంగా ఏడాదికి రూ.6,000 చొప్పున రైతులకు ప్రభుత్వం అందిస్తోంది.

PM KISAN 20th Installment: రైతన్నలకు అలర్ట్.. పీఎం కిసాన్ నగదు జమకు ముందు బిగ్ అప్డేట్.. 
వీరికి ఈ విడత రాదు: మీరు PM కిసాన్ యోజన కింద మీ e-KYCని ఇంకా పూర్తి చేయకపోతే మీ డబ్బు రాకపోవచ్చు. e-KYC లేకుండా ఎటువంటి వాయిదాలు బదిలీ చేయబడవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా, మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోతే డబ్బు బదిలీ కావని గుర్తించుకోండి.
Shaik Madar Saheb
|

Updated on: Jul 22, 2025 | 11:15 AM

Share

దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు, అన్నదాతలకు సాయం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు భారత ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించింది.. దీనిలో భాగంగా ఏడాదికి రూ.6,000 చొప్పున రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఆరు వేల మొత్తాన్ని ప్రభుత్వం మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తోంది. అయితే, ఇటీవలే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు 20వ విడత పీఎం కిసాన్ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ 20వ వాయిదా కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కోసం కేంద్రం అలర్ట్ జారీ చేసింది.

ప్రధానమంత్రి కిసాన్ పథకం 20వ విడత విడుదలకు ముందు, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ పథకం లబ్ధిదారులకు ఒక ప్రజా సలహాను జారీ చేసింది. పిఎం కిసాన్‌కు సంబంధించిన తప్పుడు సమాచారం పట్ల లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది. వ్యవసాయం – రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని PMKISAN పథకం అధికారిక ట్విట్టర్ ఖాతా పలు సూచనలు చేస్తూ కీలక ట్వీట్ చేసింది.. “రైతు సోదరసోదరీమణులారా, PM-KISAN పేరుతో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం పట్ల జాగ్రత్త వహించండి. https://pmkisan.gov.in – @pmkisanofficial లను మాత్రమే విశ్వసించండి. నకిలీ లింక్‌లు, కాల్‌లు, సందేశాలకు దూరంగా ఉండండి.” అంటూ అలర్ట్ జారీ చేసింది.

ఇప్పటికే.. PM-Kisan పథకం 20వ విడత కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. దీని కింద వారి బ్యాంకు ఖాతాలో రూ. 2,000 జమ అవుతుంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందడానికి, రైతులు ఈ 5 ప్రధాన విషయాలను గుర్తుంచుకోవాలి..

  1. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయండి
  2. మీ ఆధార్ సీడింగ్‌ను బ్యాంక్ ఖాతా స్థితితో తనిఖీ చేయండి
  3. మీ ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలో మీ DBT ఎంపికను యాక్టివ్‌గా ఉంచండి
  4. మీ e-KYCని పూర్తి చేయండి
  5. PM కిసాన్ పోర్టల్‌లోని ‘నో యువర్ స్టేటస్’ మాడ్యూల్ కింద మీ ఆధార్ సీడింగ్ స్థితిని తనిఖీ చేయండి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత: లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా తనిఖీ చేయాలి?

అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ పోర్టల్‌ను సందర్శించండి.. దీనిలో రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా – పంచాయతీని ఎంచుకోండి.. ఆ తర్వాత షో బటన్ పై క్లిక్ చేయండి.. దీని తర్వాత మీరు మీ వివరాలను ఎంచుకోవచ్చు.. ‘రిపోర్ట్ పొందండి’ బటన్ క్లిక్ చేయడం ద్వారా.. మీ పేరును లబ్ధిదారుల జాబితాలో చూడవచ్చు

ఫిబ్రవరిలో PM-KISAN 19వ విడత విడుదల

ఈ ఏడాది ఫిబ్రవరిలో భిహార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యొక్క 19వ విడతను ప్రధాన మంత్రి మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మంది మహిళా రైతులతో సహా 9.8 కోట్ల మంది రైతులకు PM-KISAN పథకం 19వ విడత వాయిదా బదిలీ చేయబడింది.. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా రూ.22,000 కోట్లకు పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..