Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. కూల్‌గా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మన చమురు ధరలపై కనిపించడం లేదు. అయితే మరొకొద్ది రోజుల్లో..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. కూల్‌గా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..
Petrol Diesel Price
Follow us

|

Updated on: Mar 06, 2022 | 8:59 AM

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రముఖ చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 6 ఆదివారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. నేటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుని 123 రోజులు అవుతోంది. మరోవైపు , ఉక్రెయిన్  పై రష్యా దాడులు జరుపుతూనే ఉంది. అయితే ఈ యుద్ధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురులపై పడింది.  దీంతో ముడిచమురు ధరలు మండిపోతున్నాయి. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో 70 డాలర్ల దిగువన ఉన్న ముడి చమురు ధరలు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరువయ్యాయి. అంటే కేవలం 3 నెలల్లోనే ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 50 డాలర్లు పెరిగింది. ఆదివారం, మార్చి 6, 2022, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $ 118.1 చేరింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.25గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.65గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.86గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.83గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.51 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.91గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.03గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.51లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.33 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.85గా ఉంది.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం..దద్దరిల్లుతున్న పట్టణాలు.. కుప్పకూలుతున్న భవనాలు..

Job Fair: రౌడీషీటర్లకు బంపర్ ఆఫర్.. పోలీసుల జాబ్‌ మేళాకు భారీ స్పందన..