Mother Dairy Milk Price: అమూల్ బాటలో మదర్ డెయిరీ.. పెరిగిన ధరలు..!
Mother Dairy Milk Price: నిత్యావసర సరుకుల ధరలతో పాటు పాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రతి నిత్యం ఉపయోగించే పాల ధరలకు రెక్కలొస్తున్నాయి...
Mother Dairy Milk Price: నిత్యావసర సరుకుల ధరలతో పాటు పాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రతి నిత్యం ఉపయోగించే పాల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇటీవల అమూల్ పాల ధర పెరుగగా, దాని బాటలోనే మదర్ డెయిరీ (Mother Dairy)పయనిస్తోంది. మదర్ డెయిరీ పాల ధరలను పెంచేసింది. ఢిల్లీ ప్రాంతంలో లీటర్ పాల ధర (Milk Rate) రూ.2 పెంచుతున్నట్లు ప్రకటిచింది. పెంచిన ధరలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. అయితే ఇంతకు ముందు అమూల్, పరాగ్ మిల్క్ కూడా లీటర్‌పై రూ.2 చొప్పున పెంచాయి. ప్రస్తుతం రూ.57 ఉన్న ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ ధర ఆదివారం నుంచి రూ.59 కానుంది.
ఇక టోల్డ్ మిల్క్ లీటర్ ధర రూ.49లకు, డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.43కు చేరింది. లీటర్ ఆవు పాలు రూ.49 నుంచి రూ.51కి చేరినట్లు మదర్‌డైరీ తెలిపింది. ఇక వెండింగ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటర్‌కు రూ.44 నుంచి రూ.46లకు చేరింది. ఇటీవల అమూల్, గోవర్ధన్ డైరీ కంపెనీలు లీటర్ పాల ధర మార్చి 1 నుంచి పెంచింది. ఎఫ్‌ఎంసీజీ డెయిరీ కంపెనీ పరాగ్ మిల్క్, గోవర్ధన్ బ్రాండ్ ఆవు పాలు లీటర్‌పై రూ.2 పెంచింది.
మదర్ డెయిరీ పెంచిన ధరల వివరాలు:
► బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్)- రూ.44 నుంచి రూ.46కి పెంపు
► ఆల్ట్రా ప్రీమియం మిల్క్ (500ml) -రూ.31 నుంచి రూ.32కి పెంపు
► ఫుల్ క్రీమ్ మిల్క్ (లీటర్) – రూ.57 నుంచి రూ.59కి పెంపు
► ఫుల్ క్రీమ్ మిల్క్ (500ml) – రూ.29 నుంచి రూ.30కి పెంపు
► ఆవు పావు (లీటర్) రూ.49 నుంచి రూ.51కి పెంపు
► ఆవు పాలు (500ml) – రూ.25 నుంచి రూ.26కి పెంపు
► టోన్డ్ మిల్క్ (లీటర్) – రూ.47 నుంచి రూ.49కి పెంపు
► టోన్డ్ మిల్క్ (500ml) – రూ.24 నుంచి రూ.25కి పెంపు
► డబుల్ టోన్డ్ మిల్క్ (లీటర్) రూ.41 నుంచి రూ.43కి పెంపు
► డబుల్ టోన్డ్ మిల్క్ (500ml)- రూ. రూ.21 నుంచి రూ.22కి పెంపు
► సూపర్ టీ మిల్క్ (500ml) – రూ.26 నుంచి రూ.27కు పెంపు
ఇవి కూడా చదవండి: