Insurance Premium: వాహనదారులకు షాక్.. మరింతగా పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు.. దేనికి ఎంతంటే..
Vehicles Insurance Premium: ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. వాహనం కొనుగోలు చేసిన సమయంలో ముందుగానే ఇన్సూరెన్స్ చేస్తుంటారు. దాని వ్యాలిడిటీ..
Vehicles Insurance Premium: ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. వాహనం కొనుగోలు చేసిన సమయంలో ముందుగానే ఇన్సూరెన్స్ చేస్తుంటారు. దాని వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్లీ ఇన్సూరెన్స్ (Insurance)చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు షాకిచ్చింది కేంద్ర రోడ్డు రవాణా సంస్థ. థర్డ్ పార్టీ (Third-party) మోటారు ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచాలని ప్రతిపాదించింది. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కార్ల ప్రీమియం ధరలు:
1000 సీసీ సామర్థ్యం గల ప్రైవేటు ప్రీమియం రూ.2,074 నుంచి రూ.2,094కు పెరగనుంది. 1,000-1,500 సీసీ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్లకు రూ.3,221 నుంచి రూ.3,416 వరకు పెరగనుంది. ఇక 1,500 సీసీ కంటే ఎక్కువగా ఉన్న వాటికి రూ.7,890 నుంచి రూ.7,897
ద్విచక్ర వాహనాలకు..
ఇక ద్విచక్ర వాహనాల విషయానికొస్తే 150 సీసీ ఉన్న ద్విచక్ర వాహనానికి రూ.1,366, 350పై ఉన్న సీసీ ద్విచక్ర వాహనాలకు రూ.2,804 చెల్లించాల్సి ఉంటుంది. ఇక గూడ్స్ వాహనాలు 12-20 వేల కిలోల సామర్థ్యం ఉన్న వాటికి రూ.33,414 నుంచి రూ.25,313 వరకు, 40వేల కిలోలకుపైన ఉన్న వాహనాలకు రూ41,561 నుంచి రూ.44,242 వరకు చేరనుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు 15 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహణాలకు 7.5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇన్సూరెన్స్ నియంత్రణ కంపెనీ ఐఆర్‌డీఏఐ (IRDAI) గతంలోనే ఈ ప్రతిపాదన చేయగా, ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం రోడ్డు రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి: