Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల అప్‌డేట్ వచ్చేసింది.. నేడు ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..

Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల అప్‌డేట్స్ విడుదల చేశాయి చమురు సంస్థలు. ఇవాళ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల అప్‌డేట్ వచ్చేసింది.. నేడు ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..
Fuel Price
Follow us
Shiva Prajapati

|

Updated on: May 31, 2022 | 7:33 AM

Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల అప్‌డేట్స్ విడుదల చేశాయి చమురు సంస్థలు. ఇవాళ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.96.72, డీజిల్ రూ.89.62గా సేల్ అవుతోంది. అదే సమయంలో ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.96, డీజిల్ ధర రూ. 97.82 గా ఉంది.

కాగా.. కేరళ, రాజస్థాన్ ప్రభుత్వాలు వ్యాట్‌ని తగ్గించినప్పటికీ, అనేక ఇతర నగరాల కంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. జైపూర్‌లో పెట్రోలు ధర రూ. 109.46 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 94.61. తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.107.87, డీజిల్ రూ.96.67గా ఉంది. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ఇక్కడ తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. ఢిల్లీ 96.72 89.62 ముంబై 111.35 97.28 కోల్‌కతా 106.03 92.76 చెన్నై 102.63 94.24 బెంగళూరు 101.94 87.89 హైదరాబాద్ 109.66 97.82 పాట్నా 107.24 94.04 భోపాల్ 108.65 93.90 జైపూర్ 109.46 94.61 లక్నో 96.57 89.76 తిరువనంతపురం 107.87 96.67 విజయవాడ 111.33 99.12 విశాఖపట్నం 111.23 98.87

ఇవి కూడా చదవండి

పెట్రోల్, డీజిల్ పై పన్ను ఎంత ఉంది? ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. ఇందులో బేస్ ధర రూ.57.13 కాగా, రవాణా ఛార్జీలు రూ.0.20. డీలర్లకు రూ. 57.33 అవుతుంది. దీనికి ఎక్సైజ్ సుంకం రూ.19.90, వ్యాట్ రూ.15.71, డీలర్ కమీషన్ రూ.3.78 గా ఉంది.

అదే సమయంలో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ఇందులో బేస్ ధర రూ. 57.92 కాగా, ఛార్జీ రూ.0.22. డీలర్లకు రూ.58.14 అవుతుంది. దీనిపై ఎక్సైజ్ సుంకం రూ.15.80, వ్యాట్ రూ.13.11. డీలర్ కమీషన్ లీటరుకు రూ.2.57. కాగా, మే 22న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించిన తరువాత దేశంలోని వివిధ నగరాల్లో చమురు ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంది.