భగ్గుమంటోన్న పెట్రోల్ ధరలు.. పదో రోజు ఎంత పెరిగిందంటే?
దేశ వ్యాప్తంగా పదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు 48 పైసలు పెరుగగా, డీజిల్‌పై 57 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.73కి చేరగా, లీటర్ డీజిల్ ధర...
దేశ వ్యాప్తంగా పదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు 48 పైసలు పెరుగగా, డీజిల్‌పై 57 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.73కి చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.75.19 చేరుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 12 వారాల షట్‌డౌన్ అనంతరం చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు ఈ పెరిగిన పెట్రోల్ ధరలతో మరింత ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్ ధరలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలు వల్లే ఆయా చోట్లలో ధరల్లో మార్పు ఉంటుందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
కాగా తాజాగా చమురు ధరలపై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆదాయ మార్గాలు సన్నగిల్లిన నేపథ్యంలో ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన ఈ రోజు అర్థరాత్రి నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ స్పష్టం చేశారు. దీంతో అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.73.88, రూ.72.12గా అయ్యాయి.
ప్రముఖ నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు:
– హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ.79.65, డీజిల్ రూ.73.49 – అమరావతిలో పెట్రోల్ లీటర్ రూ.80.02, డీజిల్ రూ.73.87 – న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.76.73, డీజిల్ రూ.75.19 – ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.83.62, డీజిల్ రూ.81.00
Read More: