కరోనా ఐడియా : ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా..

మద్యం షాపు యజమాని టెక్నిక్ చూసి ఫిదా అయ్యారు ఆనంద్ మహీంద్రా. ఈ ఐడియాను మరింత నవీకరిస్తే బాగుంటుందని ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు....

కరోనా ఐడియా : ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా..
Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Jun 16, 2020 | 10:55 AM

కరోనా పుణ్యమా అని ఎన్నో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి తోచిన తరహాలో వారు భౌతిక దూరం నిబంధన పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో డబ్బులు, వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి రోజు వారి పనులను కూడా చాలా జాగ్రతలు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులతో సోషల్ డిస్టెన్స్‌ను పాటించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బీహార్‌లో ఓ మద్యం షాపు యజమాని అమలు చేస్తున్న కొత్త టెక్నిక్‌ను ఆనంద్ మహీంద్రాను తెగ ఆకట్టుకుంది.

మద్యం షాపులో మద్యం అమ్మేందకు కొత్త పద్దతిని ఏర్పాటు చేసుకున్నాడు యజమాని. దాదాపు 5 అడుగుల పొడవుండే పెద్ద పైపును ఏర్పాటు చేశాడు. ఆ పైపులోకి తాడు కట్టి ఉన్న ఓ బాటిల్‌ను అమర్చాడు. బాటిల్ దాని అంతట అదే జారి  కస్టమర్ వైపు చివరకు వెళ్లిపోతుంది. అవసరమైనప్పుడు తాడు సాయంతో దాన్ని తిరిగి వెనక్కు తీసుకోవచ్చు. ఇక మద్యం కొనుగోలు చేయాలనుకున్న వారు ముందుగా ఆ బాటిల్ లో డబ్బులు పెడితే.. యజమాని తాడు సాయంతో గొట్టం ద్వారా బాటిల్ ను వెనక్కు లాగి అందులోని డబ్బు తీసుకుంటాడు. ఆ తరువాత కస్టమర్ కోరిన మద్యాన్ని ఆ గొట్టంలోకి జారవిడిస్తే.. అది వినియోగదారుడి చేతిలోకి వచ్చిపడుతుంది.

మద్యం షాపు యజమాని టెక్నిక్ చూసి ఫిదా అయ్యారు ఆనంద్ మహీంద్రా. ఈ ఐడియాను మరింత నవీకరిస్తే బాగుంటుందని ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తుల్లో బ్లూటూత్ ఆధారంగా ఈ ఐడియాను మరింత అభివ‌ృద్ధి చేస్తారేమో అని అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu