భారత్ లో కరోనా మరణ మృదంగం !
ఇండియాలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 43 వేల మార్క్ ను దాటింది. నిన్న ఒక్కరోజే 380 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాబారినపడి చనిపోయినవారి సంఖ్య 9,900కి చేరింది.
ఇండియాలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 43 వేల మార్క్ ను దాటింది. నిన్న ఒక్కరోజే 380 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాబారినపడి చనిపోయినవారి సంఖ్య 9,900కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 కేసలుు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 3,43,091లకు చేరాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి 1,80,013 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశంలో కరోనాబారినపడి కోలుకుంటున్నవారి శాతం పెరుగుతుండటం కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.5 శాతంగా వుంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ పైపైకి దూసుకెళ్తోంది. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో వుంది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీల గుజరాత్, మధ్యప్రదేశ్ లలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలలోను కరోనా తీవ్ర ప్రతాపం చూపుతుంది.