కాసేపట్లో.. శుభవార్త చెప్పనున్న సీఎం కేసీఆర్

మరికాసేపట్లో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. కొండపోచమ్మ ప్రారంభం రోజు రైతులకు సీఎం కేసీఆర్ త్వరలో శుభవార్త చెప్తాన్న విశయం తెలిసిందే.. ఈ సమావేశంలో రైతులకి ప్రకటించే కొత్త పథకంపై నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉంది. 

కాసేపట్లో.. శుభవార్త చెప్పనున్న సీఎం కేసీఆర్
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 16, 2020 | 10:49 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరికాసేపట్లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులు సహా ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో (మంగళవారం) ఈ ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశానికి స్థానిక సంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు సమావేశానికి హాజరు అవుతున్నారు.

అయితే.. కొండపోచమ్మ ప్రారంభం రోజు రైతులకు సీఎం కెసిఆర్ త్వరలో శుభవార్త చెప్తానన్నారు. ఈ సమావేశంలో రైతులకి ప్రకటించే కొత్త పథకంపై నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం నిధులతో వీలైనన్ని ఎక్కువ శాఖల్లో ఎక్కువ పనులు చేయాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనునున్నారు.  దీనితోపాటు పలు కీలక అంశాలపై చర్చించి కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నియంత్రిత సాగు, రైతు వేదికల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రగతి, కరోనా, సీజనల్‌ వ్యాధుల నివారణ సహా ఇతర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.