కరోనా కేసుల్లో బెల్జియంను దాటేసిన భారత్ !

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య తాజాగా 81 లక్షలు దాటింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 4,38,596కు చేరుకుంది. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో వుంది.

కరోనా కేసుల్లో బెల్జియంను దాటేసిన భారత్ !
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 16, 2020 | 10:35 AM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య తాజాగా 81 లక్షలు దాటింది. ఇప్పటివరకు 81,08,787 మంది కరోనా బారిన పడ్డారు. మరోపక్క కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 4,38,596గా ఉంది. ఇక కరోనా నుంచి ప్రపంచవ్యాప్తంగా 41,35,523 మంది కోలుకున్నారు. ప్రపంచదేశాల్లో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికా మూడు నెలల నుంచి కరోనాకు కేంద్రంగానే ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 21,82,950 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా కారణంగా ఆ దేశంలో 1,18,283 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో ఇప్పటివరకు 8,89,866 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,18,283 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అమెరికా తరువాతి నాలుగు స్థానాల్లో బ్రెజిల్, రష్యా, భారత్, యూకే దేశాలు ఉన్నాయి. ఈ నాలుగు దేశాల్లో నమోదైన మొత్తం కేసులను కలిపినా అమెరికాలో నమోదైన కేసుల కంటే తక్కువగానే ఉండటం విశేషం. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో వుంది.