Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి.. ఏ నగరంలో ఎంత..?
Petrol-Diesel Price Today: దేశంలో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చమురు ధరలకు బ్రేకులు..
Petrol-Diesel Price Today: దేశంలో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చమురు ధరలకు బ్రేకులు పడుతున్నాయి. దేశంలో 66 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ముడి చమురు బ్యారెల్‌కు 105 డాలర్లుగా కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.63 ఉండగా, డీజిల్ ధర రూ.94.24 ఉంది. కోల్‌కతాలో రూ.106.03 ఉండగా, డీజిల్ ధర రూ.92.76 ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94 ఉండగా, డీజిల్ ధర రూ.87.89 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, డీజిల్ ధర రూ.97.82గా ఉంది. బీహార్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24 ఉండగా, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..