- Telugu News Photo Gallery Volvo XC40 Recharge, India's most affordable luxury EV launched. Check price
Volvo XC40: వోల్వో ఇండియా నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్‌తో 400 కి.మీ మైలేజీ..!
Volvo XC40: దేశంలో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ ధరల కారణంగా పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దిగాయి. ఇప్పటికే పలు..
Updated on: Jul 27, 2022 | 10:00 AM

Volvo XC40: దేశంలో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ ధరల కారణంగా పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దిగాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రాగా, మరిన్ని కార్లు రోడ్లెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇక తాజాగా వోల్వో కార్ ఇండియా భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ ఎస్‌యూవీ XC40ని మార్కెట్లో విడుదల చేసింది. ఈ SUV కారుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సదరు కంపెనీ వెల్లడించింది.

ఈ ఎలక్ట్రిక్ కారు ధర విషయానికొస్తే.. ఎక్స్-షోరూమ్ ధర రూ.55.9 లక్షలు ఉంటుందని కంపెనీ ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ఈ కారు కొనుగోలు చేయాలంటే వోల్వో కార్ ఇండియా వెబ్‌సైట్‌లో రూ.50వేలు ముందుగానే చెల్లించి కారును బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు

ఇంకో విషయం ఏంటంటే ఈ కారు కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమేనని, నేరుగా కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం లేదని అన్నారు. ఈ ఎలక్ట్రిక్ కారును 408 HP సామర్థ్యంతో తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వోల్వో కారును తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే విక్రయించే కంపెనీ.. జూలై 27 ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుందని తెలిపింది. ఈ కారు 8 సంవత్సరాల వారంటీ, 11kw సామర్థ్యం గల ఒక వాల్‌బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది.





























