Personal vs Gold Loan : పర్సనల్ లోన్ వర్సెస్ గోల్డ్ లోన్..! ఈ రెండిటిలో ఏది బెటర్.. తెలుసుకోండి..
Personal vs Gold Loan : ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో చాలామంది లోన్స్ గురించి వెతుకుతారు.
Personal vs Gold Loan : ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో చాలామంది లోన్స్ గురించి వెతుకుతారు. అయితే మార్కెట్లో చాలా రుణ ఎంపికలు ఉన్నాయి. కానీ అందులో ఏది మంచిది ఏది చెడ్డది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే భవిష్యత్‌లో చాలా పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది. చాలామంది బంగారు రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఆధారపడుతారు. ఎందుకంటే ఈ రెండు రుణాల ద్వారానే వారి చేతికి తొందరగా డబ్బు చేరుతుంది. అంతేకాదు రుణం మంజూరు చేయడానికి ఆంక్షలు కూడా తక్కువగా ఉండటం వీరికి కలిసి వస్తుంది. అయితే ఈ రెండిటిలో ఏది బెటర్‌గా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం.
గోల్డ్ లోన్.. గోల్డ్ లోన్ – గోల్డ్ లోన్ అంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం. అంటే మనం తాకట్టు పెట్టే బంగారం విలువ ఎంత ఉంటుందో దానిని బట్టి వారు అమౌంట్ డిక్లేర్ చేస్తారు. ఈ రుణాన్ని కొన్ని నెలవారీ వాయిదాల ద్వారా చెల్లిస్తారు. మొత్తం అమౌంట్ క్లియర్ అయిన తర్వాత వారి బంగారం వారికి ఇచ్చేస్తారు. అయితే ఇది సురక్షిత రుణంగా చాలామంది భావిస్తారు.
పర్సనల్ లోన్.. దీనిని వ్యక్తిగత రుణం అంటారు. ఈ రుణాలను ఎలా ఇస్తారంటే మీ క్రెడిట్ స్కోరు, గతంలో మీరు తీసుకున్న లోన్ సరిగ్గా చెల్లించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ రుణం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే బ్యాంకులు ఎంక్వైరీ చేసి రుణం మంజూరు చేస్తాయి. దీనికి కొంచెం సమయం పడుతుంది. అంతేకాకుండా రుణం కూడా వీలైనంత తక్కువగా ఇస్తారు. వడ్డీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రుణాలను కూడా నెలవారీ వాయిదాల ద్వారా చెల్లించాలి.
వడ్డీ రేట్లు రుణదాతలు రుణం చెల్లింపుల ప్రకారం అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తారు. బంగారు రుణాలు వ్యక్తిగత రుణాలపై వడ్డీ అధికంగా ఉంటుంది. సగటున బంగారు రుణ వడ్డీ మొత్తం 29% నుంచి 7.5% మధ్య మారవచ్చు. దీనికి విరుద్ధంగా వ్యక్తిగత రుణాలు 9% నుంచి 24% వరకు ఉంటాయి. అయితే రుణం కోసం వడ్డీ రేటులో రిస్క్ అసెస్‌మెంట్ పెద్ద పాత్ర పోషిస్తుంది. బంగారు రుణాలు తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి ఎందుకంటే అవి సురక్షితమైన రుణం. అదే సమయంలో వ్యక్తిగత రుణాలు అసురక్షితమైనవి. ఇవి అధిక వడ్డీ ఖర్చును కలిగి ఉంటాయి.