Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. ఆగస్ట్‌లో 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఎప్పుడెప్పుడంటే..
Bank Holidays in August 2021: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ప్రతి నెల బ్యాంక్ హాలీడేస్ జాబితా విడుదలవుతుందన్న విషయం తెలిసిందే.
Bank Holidays in August 2021: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ప్రతి నెల బ్యాంక్ హాలీడేస్ జాబితా విడుదలవుతుందన్న విషయం తెలిసిందే. ఆదివారాలు, శనివారాలతోపాటు.. పండుగలకు, ప్రత్యేకమైన రోజున బ్యాంకులు మూతపడతాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితులలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు మూత పడనున్నాయో తెలుసుకుని వెళ్లడం మంచింది. ఆగస్ట్ నెలలో బ్యాంకులు శని, ఆది వారాలు కాకుండా.. ఇంకా ఎనిమిది రోజులు బంద్ కానున్నాయి. అంటే ఆగస్ట్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు అన్నమాట.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన జాబితా ప్రకారం బ్యాంకులకు ఆగస్టులో 15 రోజులు సెలవులుగా ప్రకటించింది. అందులో 7 రోజులు సాధారణ వారంతపు సెలవులు కాగా.. మిగిలినవి ఆర్బీఐ లిస్టెడ్ హాలీడేస్. అయితే ఈ బ్యాంక్ సెలవులు అనేవి.. రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. RBI భారతదేశంలోని బ్యాంకు సెలవులను మూడు వర్గాలుగా వర్గీకరిస్తుంద. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంకుల అకౌంట్స్ క్లోజింగ్. ఆగస్టు నెలలో రాష్ట్రాల వారిగా ప్రత్యేక సెలవులు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కిందకు వస్తాయి.
ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం బ్యాంకు సెలవులు.. ఆగస్ట్ 1.. ఆదివారం. ఆగస్ట్ 8.. ఆదివారం.. ఆగస్ట్ 13.. దేశభక్తుల దినోత్సవం (ఇంఫాల్) ఆగస్ట్ 14.. రెండవ శనివారం. ఆగస్ట్ 15.. ఆదివారం ఆగస్ట్ 16.. పార్సీ నూతన సంవత్సరం ఆగస్ట్ 19.. ముహర్రం. ఆగస్ట్ 20.. ముహర్రం.. ఆగస్ట్ 21.. తిరువోనం ఆగస్ట్ 22.. ఆదివారం. ఆగస్ట్ 23.. శ్రీనారాయణ గురు జయంతి. ఆగస్ట్ 28.. నాల్గవ శనివారం.. ఆగస్ట్ 29.. ఆదివారం.. ఆగస్ట్ 30.. జన్మాష్టమి.. ఆగస్ట్ 31.. శ్రీకృష్ణాష్టమి.. (హైదరాబాద్)
Also Read: Ashok Babu: ఏపీలో మైనింగ్ మాఫియా విషయంలో వైసీపీకి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సవాల్