Viral Video : చెట్టుపై నుంచి నక్కని వేటాడిని కొండచిలువ..! బొక్కలు విరిచేసి ఏకంగా మింగేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

uppula Raju

uppula Raju |

Updated on: Jul 31, 2021 | 4:52 PM

Viral Video : ఏ జంతువునైనా సజీవంగా మింగగల శక్తి పైథాన్‌కి ఉంటుంది. చాలా సార్లు మానవులు కూడా ఈ జీవికి ఆహారం అవుతారు. ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో

Viral Video : చెట్టుపై నుంచి నక్కని వేటాడిని కొండచిలువ..! బొక్కలు విరిచేసి ఏకంగా మింగేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Viral Video

Follow us on

Viral Video : ఏ జంతువునైనా సజీవంగా మింగగల శక్తి పైథాన్‌కి ఉంటుంది. చాలా సార్లు మానవులు కూడా ఈ జీవికి ఆహారం అవుతారు. ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోలో చెట్టుపై ఉన్న ఒక కొండచిలువ నక్కని సజీవంగా మింగడానికి ప్రయత్నిస్తోంది. వీడియోలో మీరు ఒక కొండచిలువ చెట్టుపై వేలాడుతుండటం గమనించవచ్చు. అది జంతువును పట్టుకుని ఉండటం కూడా చూడవచ్చు. ఈ జంతువు నక్కలా కనిపిస్తుంది. కొండచిలువ నక్క శరీరం మొత్తాన్ని విరిచేస్తుంది.

అంతేకాదు ఏకంగా దానిని మింగడానికి ప్రయత్నిస్తోంది. నక్క డ్రాగన్ బారి నుంచి బయటపడటానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు. కానీ పైథాన్ దానిని గట్టిగా పట్టుకుని చుట్టుకుని ఉంది. పైథాన్ ఒత్తిడికి నక్క చనిపోతుంది. చెట్టు నుంచి వేలాడుతూ కొండచిలువ నక్కను సగానికి మింగేస్తుంది. పూర్తిగా మింగుతుందా లేదా అనేది పూర్తిగా తెలియకపోయినా నక్కని మొత్తం మింగే శక్తి మాత్రం దానికి ఉందని జంతు నిపుణులు చెబుతున్నారు. డార్క్ సైడ్ ఆఫ్ నేచర్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ షాకింగ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 193K వ్యూస్ వచ్చాయి. అయితే దీనిని 600 మంది రీ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు 2,700 మంది లైక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మరింత వైరల్ అవుతోంది.

Covid19: ఐసోలేషన్‌లో ఉండాల్సిన వారు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు.. థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంః డీహెచ్

చైనాలో మళ్ళీ కోవిడ్ ‘గడబిడ’.. కొత్తగా 55 డెల్టా వేరియంట్ కేసులు..విమానాశ్రయంలోని .స్వీపర్లే స్ప్రెడర్స్

Allu Arha: అల్లు అర్హ క్యూట్ వీడియో షేర్ చేసిన స్నేహా రెడ్డి.. బన్నీ డాటర్ ఏం చేస్తుందో చూశారా..

Minister KTR: పరిశ్రమల స్థాపనలో తెలంగాణ దేశానికే ఆదర్శం.. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యతః కేటీఆర్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu