చైనాలో మళ్ళీ కోవిడ్ ‘గడబిడ’.. కొత్తగా 55 డెల్టా వేరియంట్ కేసులు..విమానాశ్రయంలోని .స్వీపర్లే స్ప్రెడర్స్

చైనాలో మళ్ళీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ..కొత్తగా 55 డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూశాయి .వీటిలో 30 కేసులు లోకల్ గా వ్యాప్తి చెందినవేనట.. జియాంగ్ సూ రాష్ట్రంలో..

చైనాలో మళ్ళీ కోవిడ్ 'గడబిడ'.. కొత్తగా 55 డెల్టా వేరియంట్ కేసులు..విమానాశ్రయంలోని .స్వీపర్లే  స్ప్రెడర్స్
New Delta Variant 55 Cases In China

చైనాలో మళ్ళీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ..కొత్తగా 55 డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూశాయి .వీటిలో 30 కేసులు లోకల్ గా వ్యాప్తి చెందినవేనట.. జియాంగ్ సూ రాష్ట్రంలో 19, హ్యుమాన్ లో 6, సిచువాన్, చోంగింగ్ తదితర రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్టు చైనా మీడియా తెలిపింది. ఇక ఇంపోర్టెడ్ కేసులు 25 నమోదయ్యాయని, వీటిలో యునాన్ లో 8, ష్గాంఘైలో 8 మరో మూడు రాష్ట్రాల్లో వరుసగా 3, 2, 1 చొప్పున కేసులు వెలుగులోకి వచ్చాయని అధికారులు చెప్పారు. జియాంగ్ సూ రాజధాని నాంజింగ్ విమానాశ్రయంలో 9 మంది స్వీపర్లు కోవిడ్ కి గురి కాగా వారి నుంచి ఇతర ప్రయాణికులకు కూడా ఇది సోకింది.జులై 20 న తొలి కేసు నమోదైన నాంజింగ్ లో ప్రస్తుతం 184 కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తానికి తాజా కేసులు ఇతర రాష్ట్రాలకు, చివరికి రాజధాని బీజింగ్ కి కూడా వ్యాప్తి చెందాయి.

ఇక హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ తీసిన ‘అవతార్’ మూవీ షూటింగ్ జరిగిన హ్యూనన్ ప్రావిన్స్ లోని జంజియాజీ ప్రాంతం కూడా కోవిడ్ బారిన పడింది. ఈ ప్రాంతంలోని సుమారు ఐదారుగురు వ్యక్తులు ఈ వ్యాధికి గురయ్యారు. ఇప్పటివరకు ఇది కోవిడ్ ఫ్రీ ప్రాంతంగా ఉండేదట. ఈ నెల 22 న ఇక్కడ జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి సుమారు 2 వేలమందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వీరిలో చాలామంది మాస్కులు ధరించలేదని తెలిసింది. నిన్న మొన్నటివరకు కోవిడ్ ని దీటుగా నిర్మూలించగలిగిందని పాపులర్ అయిన చైనాలో మళ్ళీ డెల్టా వేరియంట్ కేసులు ప్రబలడం విశేషమే.

మరిన్ని ఇక్కడ చూడండి : భారీ వర్షాలు ఆ గ్రామానికి శాపాలుగా మారాయి.. ఎడ్లబండి లోనే ప్రసవించిన మహిళ..:woman gave birth in cart Video.

 ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్‌..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.

 ప్రిన్సిపల్‌ అయితే నాకేంది? బడిలో అనుకోని అతిథి పెత్తనం..వానర బీభత్సం..:Monkey In School Video.

సముద్రం అడుగున చిక్కిన ఏలియన్స్ ..!రష్యా చేపల వేటలో వింత చేప..ఏలియన్ రూపంలో..:Alien In Sea video.

Click on your DTH Provider to Add TV9 Telugu