Viral Video: ఆవేశం ఆగని వరుడు.. అందరి ముందు అలా.. సిగ్గుతో తలదాచుకున్న వధువు!
Viral Video: పెళ్లి అంటే నూరేళ్లపంట. వివాహమహోత్సం చిరకాలం గుర్తిండిపోయేలా ప్రతీ ఒక్కరూ మధురమైన క్షణాలను వీడియోల రూపంలో...
పెళ్లి అంటే నూరేళ్లపంట. వివాహమహోత్సం చిరకాలం గుర్తిండిపోయేలా ప్రతీ ఒక్కరూ మధురమైన క్షణాలను వీడియోల రూపంలో తీసుకుంటూ ఉంటారు. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ వీడియో క్యూట్‌గా ఉంటుంది. అవి సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పెళ్లికొడుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అతడు చేసిన పని వీక్షకులను భలేగా ఆకట్టుకుంది. ఆ వీడియోను చూసిన తర్వాత మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.
వధువును కుటుంబ సభ్యులు వేదికపైకి తీసుకొస్తున్నట్లు మీరు ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. అప్పటికే వేచి చూస్తున్న వరుడు.. ఆవేశంగా ఆమె దగ్గరకు పరుగున వెళ్లి.. వధువును భుజాలపై ఎత్తుకుని మరీ వేదికపైకి తీసుకొస్తాడు. వరుడు చేసిన ఈ చర్యను ఊహించని నవవధువు.. పాపం.! ఏం చెయ్యాలో తెలియక సిగ్గుతో అతడిలో ఒదిగిపోయింది. వీరిద్దరిని కెమెరాలు క్లిక్ మనిపించాయి. చివరికి పెళ్లికొడుకు ఆమెను దించి సోఫాపై కూర్చోబెట్టాడు.
ఈ వీడియోను నిరంజన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ”సినిమాల ప్రభావం” అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ”ఎందుకింత ఖంగారు బ్రదర్” అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇప్పటిదాకా ఈ వీడియోను 5 వేల పైచిలుకు మంది వీక్షించారు.
View this post on Instagram