Paytm: పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ఇటీవల కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం పేటీఎమ్ ఆపరేటర్ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్)కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా అనుమతి లభించింది. దీంతో మల్టీ మోడల్ బ్యాంకు కింద పేటీఎమ్ యూపీఐ సేవలు అందజేసే అవకాశం లభించింది. యాక్సిస్, హెచ్ ఢీఎఫ్ సీ, ఎస్ బీఐ, యస్ బ్యాంకులతో కలిసి టీ పీఏపీగా పని చేయనుంది.

Paytm: పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
Paytm
Follow us

|

Updated on: Apr 20, 2024 | 5:16 PM

పేటీఎమ్ సంస్థ తమ యూపీఏ ఖాతాదారుల తరలింపు ప్రక్రియను ముమ్మరంగా చేసింది. యాక్సిస్, హెచ్ డీఎఫ్ సీ, ఎస్బీఐ, యస్ బ్యాంకులకు ఖాతాల నిర్వహణను బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ ఈనెల 17న ప్రారంభించింది. ఇకపై మల్టీ మోడల్ బ్రాండ్ కింద పేటీఎమ్ సేవలను యూపీఐ అందించనుంది. పైన తెలిపిన బ్యాంకులనీ పేటీఎమ్ కు ప్రొవైడర్ సిస్టమ్ బ్యాంకులు (పీఎన్ బీ)లుగా వ్యవహరిస్తాయి. ప్రతి పేటీఎమ్ యూపీఐ ఖాతాదారుడూ @ptsbi, @pthdfc, @ptaxis,@ptyes అనే నాలుగు హ్యాండిల్స్‌లో ఒకదానితో ఉన్న కొత్త యూపీఏ ఐడీతో పేటీఎమ్ ను ఉపయోగించడానికి అంగీకారం కోరుతూ నోటిఫికేషన్లు వస్తాయి. ఈ మార్పు ఎందుకు చేస్తున్నారనే విషయాలను తెలుసుకుందాం.

వివరాలు ఇవీ..

ఇప్పటి వరకూ పేటీఎమ్ యూపీఏ ఖాతాదారులు తమ ఓసీఎల్ కు అనుబంధంగా ఉన్నపేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)ను తమ పీఎస్ పీ గా ఉపయోగించుకుంటున్నారు. అయితే పీపీబీఎల్ నిబంధనలను సక్రమంగా పాటించని కారణంగా దానిపై 2024 ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. మార్చి 15 లోపు అన్ని లావాదేవీలను సెటిల్ చేయాలని, నోడల్ ఖాతాలను క్లియర్ చేయాలని ఆదేశించింది. అలాగే మార్చి ఒకటి నుంచి కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా, క్రెడిట్ లావాదేవీలను చేయకుండా నిషేధించబడింది. అయితే వాలెట్ల ద్వారా జరిగే లావాదేవీలపై కొన్ని పరిమితులు విధించింది. దీంతో పీపీబీఎల్ లావాదేవీలు నిలిచిపోయాయి. యాప్, బ్యాంక్ ల మధ్య పీఎస్ పీ అనేది మధ్యవర్తిగా ఉంటుంది. పీపీబీఎల్ పై ఆంక్షల కారణంగా ఆ హోదాను కోల్పోయింది. దీంతో పేటీఎమ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా పీఎస్ పీలుగా కేవలం బ్యాంకులు మాత్రమే ఉంటాయి.

ఎన్ పీసీఐ ఉత్తర్వులతో ఊరట..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం పేటీఎమ్ ఆపరేటర్ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్)కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా అనుమతి లభించింది. దీంతో మల్టీ మోడల్ బ్యాంకు కింద పేటీఎమ్ యూపీఐ సేవలు అందజేసే అవకాశం లభించింది. యాక్సిస్, హెచ్ ఢీఎఫ్ సీ, ఎస్ బీఐ, యస్ బ్యాంకులతో కలిసి టీ పీఏపీగా పని చేయనుంది. దీంతో తమ ఖాతాలను ఈ పీఎస్ పీ బ్యాంకులకు మార్చడానికి ప్రక్రియను చేపట్టింది.

సేవలు అందించే వీలు..

ఎన్ పీసీఐ వైబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం.. పేటీఎమ్ యూపీఐ మార్కెట్ వాటా మార్చిలో తొమ్మిది శాతానికి పడిపోయింది. గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయికి చేరింది. పీపీబీఎల్ పై ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఇలా జరిగింది. దీంతో టీపీఏపీగా యూపీఏ సేవల్లో ఎన్ పీసీఎల్ అనుమతి వచ్చిన తర్వాత పేటీఎమ్ కు ఊరట లభించింది. తన ఖాతాదారులకు యూపీఐ సేవలు అందించే వీలు కలిగింది. గతంలో పేటీఎమ్ తన సొంత పీఎస్ బీ ద్వారా తన ఖాతాదారులకు యూపీఐ సేవలు అందించింది. ఆర్ బీఐ ఆంక్షల కారణంగా దాని లావాదేవీలు నిలిచిపోయాయి. ఇప్పుడు పైన తెలిపిన నాలుగు బ్యాంకులను పీఎస్ బీలుగా పెట్టుకుని, థర్ట్ పార్టీ ప్రొవైడర్ గా సేవలు అందించనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..