AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm: నిలిచిపోనున్న పేటీఎం సేవలు.. 15 రోజులే గడువు.. ఆలోపు ఈ పని చేయకపోతే అంతే..!

పీపీబీఎల్ ఇప్పటికే ఉన్న అన్ని లావాదేవీలను మార్చి 15, 2024లోగా పరిష్కరించాలని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ చర్యలు పేటీఎం యూపీఐ సేవలపై కూడా ప్రభావం చూపింది. అయినప్పటికీ పేటీఎం యూపీఐ ఐడీ వినియోగం గురించి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చినందున వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఎకోసిస్టమ్‌లో ఎలాంటి అంతరాయాలను నివారించే ప్రయత్నంలో యూపీఐ హ్యాండిల్ '@paytm'ని ఉపయోగించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లను 4-5 ఇతర బ్యాంకులకు తరలించే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా ఎన్‌పీసీఐను ఆర్‌బీఐ కోరింది.

Paytm: నిలిచిపోనున్న పేటీఎం సేవలు.. 15 రోజులే గడువు.. ఆలోపు ఈ పని చేయకపోతే అంతే..!
Paytm
Nikhil
|

Updated on: Feb 28, 2024 | 12:00 PM

Share

జనవరి 2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై నిబంధనలను పాటించకపోవడం వల్ల ఆంక్షలు విధించింది. పీపీబీఎల్ ఇప్పటికే ఉన్న అన్ని లావాదేవీలను మార్చి 15, 2024లోగా పరిష్కరించాలని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ చర్యలు పేటీఎం యూపీఐ సేవలపై కూడా ప్రభావం చూపింది. అయినప్పటికీ పేటీఎం యూపీఐ ఐడీ వినియోగం గురించి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చినందున వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఎకోసిస్టమ్‌లో ఎలాంటి అంతరాయాలను నివారించే ప్రయత్నంలో యూపీఐ హ్యాండిల్ ‘@paytm’ని ఉపయోగించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లను 4-5 ఇతర బ్యాంకులకు తరలించే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా ఎన్‌పీసీఐను ఆర్‌బీఐ కోరింది. మార్చి 15 2024 తర్వాత డిపాజిట్లు, క్రెడిట్‌లను స్వీకరించకుండా నిరోధించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి బ్యాంకింగ్ సేవలను పొందుతున్న కస్టమర్‌లు, వాలెట్ హోల్డర్‌లు, వ్యాపారుల ప్రయోజనం కోసం సెంట్రల్ బ్యాంక్ కొన్ని అదనపు చర్యలతో ముందుకు వచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తాజా చర్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

అయితే ఆర్‌బీఐ సూచనలను ఎన్‌పీసీఐ ఆమోదిసతే “@paytm” యూపీఐ హ్యాండిల్స్‌తో పేటీఎం వినియోగదారులు కొత్తగా గుర్తించిన బ్యాంకులకు సజావుగా మారవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం దీనికి 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల బ్యాంక్ కస్టమర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం పేటీఎం యాప్‌నకు సంబంధించిన నిరంతర యూపీఐ ఆపరేషన్ కోసం యూపీఐ ఛానెల్ కోసం థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) కావాలని వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఓసీఎల్)కు సంబంధించిన అభ్యర్థనను పరిశీలించాలని ఎన్‌పీసీఐకు ఆర్‌బీఐ పేటీఎం బ్రాండ్‌ను కలిగి ఉన్న వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో అంతర్లీన ఖాతా/వాలెట్ ఉన్న కస్టమర్‌లను మార్చి 15, 2024లోపు ఇతర బ్యాంకులతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ కోరింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు ఉన్నవారు మార్చి 15, 2024 లోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చని పేర్కొంది.

మార్చి 15 తర్వాత జరిగేదిదే

మీ యూపీఐ హ్యాండిల్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి లింక్ చేస్తే మీరు మార్చి 15, 2024 తర్వాత @Paytm యూపీఐను ఉపయోగించలేరు. అందువల్ల చెల్లింపులను ప్రారంభించలేరు లేదా స్వీకరించలేరు. అలాగే మీ పేటీఎం వాలెట్‌కు డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు నిలిపివేస్తారు. అయితే మీరు ఇప్పటికీ మీ ప్రస్తుత వాలెట్ బ్యాలెన్స్‌ని లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు మీరు మీ పేటీఎం వాలెట్ నుంచి మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ తనిఖీ చేయడం, బిల్లు చెల్లింపులు మొదలైన ఇతర సేవల కోసం మీరు ఇప్పటికీ పేటీఎం యాప్‌ని ఉపయోగించవచ్చు. అలాగే మీ ఇతర బ్యాంక్ ఖాతాతో అనుసంధానించిన కొత్త యూపీఐ హ్యాండిల్‌తో ప్రస్తుతం మీ పేటీఎం యూపీఐకు లింక్ చేసిన ఏవైనా పునరావృత చెల్లింపులు లేదా సభ్యత్వాలను నవీకరించాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…