Garlic Price: అమ్మ బాబోయ్..! కిలో రూ. 500 మార్క్ చేరుకున్న నాణ్యమైన వెల్లుల్లి

వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి, టమాటా ధరలు దిగి రాగా.. ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలో 500పైనే పలుకుతోంది. దాంతో.. వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం.. రూ. 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర.. రెండు వారాల్లోనే డబుల్‌ అయ్యే పరిస్థితి చేరింది.

Garlic Price: అమ్మ బాబోయ్..! కిలో రూ. 500 మార్క్ చేరుకున్న నాణ్యమైన వెల్లుల్లి
Garlic
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Feb 28, 2024 | 7:57 AM

వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి, టమాటా ధరలు దిగి రాగా.. ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలో 500పైనే పలుకుతోంది. దాంతో.. వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం.. రూ. 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర.. రెండు వారాల్లోనే డబుల్‌ అయ్యే పరిస్థితి చేరింది.

వెల్లుల్లి లేని ఇంటి వంట బహుశా ఉండదేమో..! ఇలాంటి వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ధర ఒకేసారి 100% పెరిగి చుక్కలు చూస్తోంది. కొనలేక వంటింటి గృహిణులు మండిపడుతున్నారు. వంటింట్లో అందరూ వాడే వెల్లుల్లి ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఔషధాల తయారీలో కూడా వాడే ఈ వెల్లుల్లి సాగు ఈ సంవత్సరం వర్షాభావం కారణంగా దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో సప్లై తగ్గి డిమాండ్ పెరిగి వినియోగదారులకు భారంగా మారింది. రిటైల్ మార్కెట్లో కిలో 500 రూపాయలు పెరిగింది.

వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో మార్కెట్లోకి సరఫరా తగ్గిపోయింది. దీంతో ఇటీవల కొన్ని రోజుల్లోనే ధర అమాంతం పెరిగిపోయింది. రిటైల్ మార్కెట్లో కిలో నాణ్యతను బట్టి రూ. 350 నుంచి 500 రూపాయలకు చేరుకుంది. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ లో హోల్సేల్ మార్కెట్ లోనే రూ. 350 నుంచి 400 రూపాయలు పలుకుతోంది. నాణ్యమైన వెల్లుల్లి దర రూ. 500 దాటింది. ఉత్తరాదిన అనూహ్య వర్షాల వల్ల, దక్షిణాదిన వర్షాభావం వల్ల వెల్లుల్లి దిగుబడి దెబ్బతినిందని వ్యాపారులు అంటున్నారు. చాలా ప్రాంతాల్లో తుఫాను కూడా వెల్లుల్లి పంటను నష్టపరిచింది .దీనివల్ల మార్కెట్లోకి వెల్లుల్లి సప్లై తగ్గి ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం చలికాలంలో వెల్లుల్లి ధరలు పెరుగుతాయి. కొత్త పంట మార్కెట్లోకి వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

మరోవైపు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెల్లుల్లి ఎగుమతిపై నిషేధం విధించింది. దేశంలోనే అతిపెద్ద వెల్లుల్లి మార్కెట్లలో ఒకటైన గుజరాత్ లోని జామునగర్, మండి మార్కెట్లలో కిలో వెల్లుల్లి టోకు ధర 300 నుంచి రూ. 350 కి చేరుకుందని అక్కడ వ్యాపారులు చెప్తున్నారు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రిటైల్ గా వచ్చేసరికి రూ. 500 కు చేరిందని చెప్తున్నారు. గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ వెల్లుల్లి ఎక్కువగా సాగు అవుతోంది. ప్రతి ఇంటికి అవసరమైన వెల్లుల్లి ధరలను కేంద్రo తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక.. అల్లం, వెల్లుల్లితోపాటు.. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి