AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణంగా పతనమైన కరెన్సీ వృద్ధి.. కారణమిదేనా?

Rs 2000 Note Withdrawal Impact: 2023, మే 19న ఆర్బీఐ రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జనవరి 31 నాటికి, రూ.2,000 నోట్లలో దాదాపు 97.5 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ఇంకా దాదాపు రూ.8,897 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. 

దారుణంగా పతనమైన కరెన్సీ వృద్ధి.. కారణమిదేనా?
RBI 2k Notes
Madhu
|

Updated on: Feb 28, 2024 | 6:53 AM

Share

మార్కెట్లో కరెన్సీ సర్కులేషన్ తగ్గిందా? దీనికి ప్రధాన కారణం రూ. 2000నోట్ల రద్దు నిర్ణయమేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. 2024 ఫిబ్రవరిలో విడుదలైన కొన్ని లెక్కలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయ ప్రభావమేనని చెబుతున్నారు. చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి ఫిబ్రవరి 9తో ముగిసిన వారానికి 8.2 శాతం నుంచి 3.7 శాతానికి క్షీణించింది. కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ (సీఐసీ) అనేది చెలామణిలో ఉన్న నోట్లు, నాణేలను సూచిస్తుంది. మరోవైపు ఆర్బీఐ చెబుతున్న దాని ప్రకారం దేశంలోని వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని.. దీనికి కూడా రూ.2,000 కరెన్సీ నోట్ల ఉపసంహరణే కారణమని వివరించింది.

పూర్తిగా తిరిగిరాని రూ. 2000 నోట్లు..

2023, మే 19న ఆర్బీఐ రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జనవరి 31 నాటికి, రూ.2,000 నోట్లలో దాదాపు 97.5 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ఇంకా దాదాపు రూ.8,897 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. 2023, మే 19న రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. అటువంటి నోట్లను కలిగి ఉన్న పబ్లిక్, ఎంటిటీలు వాటిని 2023, సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని మొదట సూచించారు. ఆ తర్వాత గడువు తర్వాత అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించారు. బ్యాంకు శాఖలలో డిపాజిట్, మార్పిడి సేవలు అక్టోబర్ 7, 2023న నిలిపివేశారు. 2023, అక్టోబర్ 8 నుంచి వ్యక్తులు ఆర్బీఐ 19 కార్యాలయాలలో కరెన్సీని మార్చుకోవడం లేదా సమానమైన మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసుకునే అవకాశం కల్పించింది. 2016 నవంబర్‌లో రూ. 1,000 , రూ. 500 నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టారు.

కరెన్సీ క్షీణత ఇలా..

ఆర్బీఐ డేటా ప్రకారం రిజర్వ్ మనీ (ఆర్ఎం) వృద్ధి ఏడాది క్రితం 11.2 శాతం నుంచి ఫిబ్రవరి 9, 2024 నాటికి 5.8 శాతానికి క్షీణించింది. కరెన్సీ ఇన్ సర్కులేషన్(సీఐసీ), ఆర్బీఐ పరిధిలోని బ్యాంకుల్లో డిపాజిట్లు, సెంట్రల్ బ్యాంక్ లోని ఇతర డిపాజిట్లు ఈ రిజర్వ్ మనీ(ఆర్ఎం)లోని భాగాలుగా చెప్పొచ్చు. ఈ ఆర్ఎం లో అతి పెద్ద భాగం అయిన సీఐసీ వృద్ధి ఏడాది క్రితం 8.2 శాతం ఉండగా.. ఈ ఫిబ్రవరికి 3.7 శాతానికి క్షీణించింది. ఇది రూ. 2,000 నోట్ల ఉపసంహరణ కారణంగా జరిగిందని ఆర్బీఐ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..