Pan Card: ఆధార్‌తో పది నిమిషాల్లోనే పాన్‌ కార్డు.. ఇక ఆ కష్టాలకు చెల్లు

పాన్‌ కార్డు అంటే వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేసే పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఇది ప్రతి పన్ను చెల్లింపుదారులకు ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది. అలాగే వారి ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే పాన్‌ కార్డుకు అప్లయ్‌ చేశాక ప్రింటింగ్, పోస్టేజీ, మాన్యువల్ హ్యాండ్లింగ్ కారణంగా భౌతిక పాన్‌కార్డు పొందే సంప్రదాయ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ-పాన్‌లు ఎలక్ట్రానిక్‌గా జనరేట్‌ అవుతాయి.

Pan Card: ఆధార్‌తో పది నిమిషాల్లోనే పాన్‌ కార్డు.. ఇక ఆ కష్టాలకు చెల్లు
Pan Card
Follow us
Srinu

|

Updated on: Sep 20, 2023 | 4:00 PM

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) అనేది ఇప్పుడు అన్ని అవసరాలకు తప్పనిసరైంది. ముఖ్యంగా పన్ను ప్రయోజనాలను పొందడంతో పాటు బ్యాంకింగ్‌ అవసరాల కోసం పాన్‌కార్డు ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా మారింది.  పాన్‌ కార్డు అంటే వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేసే పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఇది ప్రతి పన్ను చెల్లింపుదారులకు ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది. అలాగే వారి ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే పాన్‌ కార్డుకు అప్లయ్‌ చేశాక ప్రింటింగ్, పోస్టేజీ, మాన్యువల్ హ్యాండ్లింగ్ కారణంగా భౌతిక పాన్‌కార్డు పొందే సంప్రదాయ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ-పాన్‌లు ఎలక్ట్రానిక్‌గా జనరేట్‌ అవుతాయి. ముఖ్యంగా జారీ సమయం గణనీయంగా తగ్గి కేవలం పది నిమిషాల్లోనే పాన్‌ నెంబర్‌ పొందవచ్చు.

ఈ-పాన్

ఈ-పాన్‌ సదుపాయం ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్న దరఖాస్తుదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తక్షణ పాన్ కేటాయించడం ఈ-పాన్‌ ప్రధాన విధుల్లో ఒకటి. పాన్‌ దరఖాస్తుదారులకు పీడీఎఫ్‌ రూపంలో జారీ చేస్తారు. ఈ సర్వీసు పూర్తిగా ఇది ఉచితం. ఈ-పాన్‌ అనేది ఆధార్ ఈ-కేవైసీ డేటా ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో డిజిటల్ సంతకంతో జారీ చేసే పాన్‌కార్డు. తక్షణ ఈ-పాన్ సేవ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ అందుబాటులో ఉంది. 

ఈ-పాన్‌ ప్రయోజనాలు

  • సులభమైన, కాగితం రహిత ప్రక్రియ
  • మీకు కావలసిందల్లా ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్
  • ఈ-పాన్‌లు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవి. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం, ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం, కేవైసీ అవసరాలను నెరవేర్చడం వంటి పాన్ అవసరమయ్యే అన్ని ప్రయోజనాల కోసం విస్తృతంగా ఆమోదిస్తారు.

ఈ-పాన్ పొందడానికి దశలు

  • ముందుగా  ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించాలి
  • స్టెప్-1: ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి తక్షణ ఈ-పాన్ క్లిక్ చేయాలి.
  • స్టెప్-2: ఈ-పాన్ పేజీలో కొత్త ఈ-పాన్ పొందు క్లిక్ చేయాలి.
  • స్టెప్-3: గెట్ న్యూ ఈ-పాన్ పేజీలో మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, నేను నిర్ధారిస్తున్నాను చెక్‌బాక్స్‌ని ఎంచుకుని కొనసాగించు క్లిక్ చేయాలి.
  • స్టెప్-4: ఓటీపీ ధ్రువీకరణ పేజీలో నేను సమ్మతి నిబంధనలను చదివాను, తదుపరి కొనసాగడానికి అంగీకరిస్తున్నాను క్లిక్ చేయాలి. కొనసాగించు క్లిక్ చేయాలి.
  • స్టెప్-5: ఓటీపీ ధ్రువీకరణ పేజీలో ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో అందుకున్న 6-అంకెల ఓటీపీని నమోదు చేయండి. యూఐడీఏఐతో ఆధార్ వివరాలను ధ్రువీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని కొనసాగించు క్లిక్ చేయాలి.
  • స్టెప్-6: ఆధార్ వివరాలని ధ్రువీకరించండి పేజీలో నేను దానిని అంగీకరిస్తున్నాను చెక్‌బాక్స్‌ని ఎంచుకుని కొనసాగించు క్లిక్ చేయండి.

అప్లికేషన్‌ను విజయవంతంగా సమర్పించాక రసీదు సంఖ్యతో పాటు విజయవంతమైన సందేశం ప్రదర్శిస్తారు. భవిష్యత్‌ సూచన కోసం అక్నాలెడ్జ్‌మెంట్ ఐడీని నోట్ చేసుకోండి. ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు మీరు నిర్ధారణ సందేశాన్ని కూడా అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?