PAN Card: పాన్ కార్డులో పేరు, పుట్టిన తేదీ తప్పుందా? ఇంట్లో నుంచే ఇలా మార్చేసుకోండి..
బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఈ పాన్ కార్డు కావాల్సిందే. కేవలం ఆదాయానికి సంబంధించిన వాటికే కాక, ఒక ఐడెంటిటీ గా కూడా పాన్ కార్డు ఉపయోగపడుతుంది. అటువంటి పాన్ కార్డులో ఏదైనా తప్పుగా ఉంటే.. ఇబ్బందులు తప్పవు.
పర్మనెంట్ అకౌంట్ నంబర్(పీఏఎన్) అనేది మన దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఈ పాన్ కార్డు కావాల్సిందే. కేవలం ఆదాయానికి సంబంధించిన వాటికే కాక, ఒక ఐడెంటిటీ గా కూడా పాన్ కార్డు ఉపయోగపడుతుంది. అటువంటి పాన్ కార్డులో ఏదైనా తప్పుగా ఉంటే.. ఇబ్బందులు తప్పవు. సాధారణంగా పాన్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం, తండ్రి పేరు, జెండర్, రెసిడెన్స్, కాంటాక్ట్ ఇన్ ఫర్మేషన్ ఉంటాయి. వాటిల్లో ఏదైనా తప్పుగా ఎంటర్ అయితే దానిని తిరిగి అప్ డేట్ చేసుకోవచ్చు. లేదా పూర్తిగా మార్చుకోవచ్చు. అది కూడా ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు. అది ఫ్రీ సర్వీస్ కాదు. అప్లికేషన్ ఫీజు రూ. 85, అలాగే సర్వీస్ ట్యాక్స్ రూ. 12.36, మొత్తం రూ. 96 ఖర్చు అవుతుంది. ఆ విధానం ఎలాగో చూద్దాం రండి..
పుట్టిన తేదీ మార్చుకోవడం ఇలా..
- ఎన్ఎస్డీఎల్ ఈ గవర్నెన్స్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో సర్వీసెస్ సెక్షన్ పాన్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
- దానిలో నుంచి అప్ డేట్/కరెక్షన్ పాన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
- దానిలో మీ పాన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి వివరాలతో స్వతహాగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూ ఆప్షన్.
- ఆ తర్వాత ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత మీరు దేనిని అప్ డేట్ చేయాలనుకొంటున్నారో దానిని ఎంపిక చేసుకోండి.
- కొత్త సమచారానికి సంబంధించిన ప్రూఫ్ ని అప్ లోడ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత కైవేసీ ప్రాసెస్ ను పూర్తి చేసి ఈ సైన్ ని సబ్మిట్ చేయాలి.
- అనంతరం దరఖాస్తుకు సంబంధించిన అక్నాలెడ్జ్ మెంట్ మీకు వస్తుంది.
- మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడీకి అప్ డేటెడ్ పాన్ కార్డు వస్తుంది.
- అలాగే మీకు అవసరం అయితే యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్ నుంచి కొత్త పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్ లైన్ లో కూడా మీరు పాన్ కార్డు ను అప్ డేట్ చేసుకోవచ్చు. అందుకోసం మీ దగ్గరలోని పాన్ సెంటర్లను సందర్శించవలసి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..