Google Pixel 6A: గూగుల్ పిక్సెల్ 6ఏపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.10 వేల కంటే అదనపు ప్రయోజనాలు

ఇటీవల గూగుల్ ఐఓ ఈవెంట్ గూగుల్ పిక్సెల్ 7 ఏ లాంచ్ చేసింది. దీంతో పిక్సెల్ 6ఏ పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. వెర్షన్‌తో సంబంధం లేకుండా గూగుల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదో మంచి డీల్ అని మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Google Pixel 6A: గూగుల్ పిక్సెల్ 6ఏపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.10 వేల కంటే అదనపు ప్రయోజనాలు
Google Pixel 6a
Follow us
Srinu

|

Updated on: May 14, 2023 | 5:30 PM

కొత్త ఒక వింత పాత ఒక రోత అనే నానుడి మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విషయంలో వినియోగదారులు ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా కొత్త ఉత్పత్తి కొనాలనుకునే సందర్భంలో కచ్చితంగా ఆ ఉత్పత్తికి సంబంధించి లేటెస్ట్ వెర్షన్ కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెల్‌ఫోన్స్ విషయంలో కచ్చితంగా వినియోగదారుడు లేటెస్ట్ ఫోన్లను కొంటూ ఉంటాడు. అయితే ఇటీవల గూగుల్ ఐఓ ఈవెంట్ గూగుల్ పిక్సెల్ 7 ఏ లాంచ్ చేసింది. దీంతో పిక్సెల్ 6ఏ పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. వెర్షన్‌తో సంబంధం లేకుండా గూగుల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదో మంచి డీల్ అని మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభ రోజుల్లో సేల్స్‌లో దుమ్ము రేపిన పిక్సెల్ 6 ఏపై ప్రస్తుతం భారీ తగ్గింపు లభించడం మంచిదేనని పేర్కొంటున్నారు. కాబట్టి ఈ పిక్సెల్ 6ఏ ఫోన్‌పై ఎలాంటి తగ్గింపు లభిస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 6ఏ లాంచ్ అయిన సందర్భంగా రూ.43,999 వద్ద లిస్ట్ అయిన ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,999కు అందుబాటులో ఉంది. అయితే ఈ ధర రోజురోజుకూ హెచ్చుతగ్గులకు గురవతూ ఉంటుంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 7ఏ అమ్మకానికి రెడిగా ఉన్న సమయంలో ఈ ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. అయితే అన్ని రోజులు వెయిట్ చేయలేం అనుకునే వారు ప్రస్తుతం ఉన్న ధరకే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రస్తుతం ఉన్న ధరపై ఇప్పటికే కొన్ని బ్యాంకుల కార్డుల ద్వారా ఇన్‌స్టంట్‌గా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. కాబట్టి మంచి ఆఫర్ వరకూ వేచి చూడలేని వారు ప్రస్తుతం ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. 

గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్లు ఇవీ

ఈ ఫోన్ లో 6.1 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ హెచ్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రోటెక్షన్ తో ఈ ఫోన్ వస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఇది వస్తుంది. కెమెరా విషయానికి వస్తే దీనిలో వెనుక వైపు 12ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..