ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేనిది ఉండటం లేదు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లోనే మునిగి తేలుతుంటారు. స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో పాటు ఫోన్ యూజర్లలో చాలామంది తమ ఫోన్ స్లోగా ఉందని, హ్యాంగ్ అవుతోందని చెబుతుంటారు. ఫోన్‌లలో అడ్డగోలుగా ఫోటోలు, వీడియోలు లోడ్ చేస్తుండటం వల్ల కూడా వేగం తగ్గిపోతుంది. అంతేకాదు రకరకాల యాప్స్ వేసుకోవడం వల్ల స్టోరేజీ నిండిపోయి ఫోన్ నెమ్మదిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా, స్మూత్‌గా మార్చడం మీ చేతిలోనే ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మారిస్తే మీ ఫోన్ వేగంగా పనిచేస్తుంది