AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother’s Day Gift: అత్యద్భుత మ్యూజిక్ అనుభవాన్ని ఆశించే వారికి బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఇవే.. మథర్స్ డే రోజు అమ్మకి గిఫ్ట్ ఇస్తేనా..

ఈ మథర్స్ డే రోజున అమ్మకు మరిచిపోలేని, మధురమైన బహుమతి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే వారికి నిత్యం అవసరం ఉండే.. ప్రతి రోజూ వినియోగించే ఏదైనా వస్తువు బహుమతిగా ఇస్తే! బావుంటుంది కదా.. మీరిచ్చిన వస్తువునే రోజూ వాడుతూ ఉంటే.. వాడినప్పుడల్లా మీరు గిఫ్ట్ ఇచ్చిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ ఫీల్ చాలా హై ఉంటుంది కదా..!

Mother's Day Gift: అత్యద్భుత మ్యూజిక్ అనుభవాన్ని ఆశించే వారికి బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఇవే.. మథర్స్ డే రోజు అమ్మకి గిఫ్ట్ ఇస్తేనా..
Apple Airpods Pro
Madhu
|

Updated on: May 14, 2023 | 1:34 PM

Share

మన జీవితంలో అద్భుతమైన వ్యక్తి అమ్మ. జీవితాంతం మన క్షేమం కోసమే తపిస్తూ.. శక్తి వంచన లేకుండా కష్టపడి ఉండే అమ్మ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం. అటువంటి అమ్మను గ్రీట్ చేయడానికి, అపురూపమైన బహుమతులు ఇవ్వడానికి వారికి మనలోని ప్రేమను కనబరచడానికి ఉపయోగపడే రోజే మథర్స్ డే. ఈ మథర్స్ డే రోజున అమ్ముక మరిచిపోలేని, మధురమైన బహుమతి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే వారికి నిత్యం అవసరం ఉండే.. ప్రతి రోజూ వినియోగించే ఏదైనా వస్తువు బహుమతిగా ఇస్తే! బావుంటుంది కదా.. మీరిచ్చిన వస్తువునే రోజూ వాడుతూ ఉంటే.. వాడినప్పుడల్లా మీరు గిఫ్ట్ ఇచ్చిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ ఫీల్ చాలా హై ఉంటుంది కదా. అటువంటి గిఫ్ట్ ఐటెం ఒకటి ఉంది. అదే ఇయర్ బడ్స్. మంచి క్వాలిటీ సౌండ్ నిచ్చే ఇయర్ బడ్స్ మీ అమ్మకు బహుమతిగా ఇస్తే ప్రతి రోజూ దానిని వినియోగించే వీలుంటుంది. అందుకే మీ అమ్మకు గిఫ్ట్ గా ఇవ్వదగిన బెస్ట్ ఇయర్ బడ్స్ ను మీకు పరిచయం చేస్తున్నాం. వాటపై ఓ లుక్కేద్దాం..

యాపిల్ ఎయిర్ పాడ్స్..

అదిరే సౌండ్ క్లారిటీతోపాటు సూపర్ పనితీరు కలిగిన ఈ ఇయర్ పాడ్స్ మీ అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ కి అయితే తిరుగులేని అనుభవాన్ని అందిస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ట్రాన్సపరెన్సీ మోడ్, కస్టమైజబుల్ పిట్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర మార్కెట్లో రూ. 19,990గా ఉంది.

యాంకర్ సౌండ్ కోర్ లైఫ్ పీ2..

ఈ యాంకర్ సౌండ్ కోర్ లైఫ్ పీ2 ఇయర్ బడ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. అయితే సౌండ్ క్లారిటీ కోసం అదిరిపోతుంది. పూర్తి వైర్ లెస్ టెక్నాలజీతో వస్తున్న ఇయర్ బడ్స్ స్నగ్ ఫిట్, నాయిస్ రిడక్షన్ ఫీచర్ ఉంటుంది. అలాగే అదిరే బ్యాటరీ లైఫ్ దీని సొంతం. ఐపీ 7 వాటర్ రెసిస్టెంట్, టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లతో ఉండే ఈ ఇయర్ బడ్స్ రోజువారీ అవసరాలకు బెస్ట్ చాయిస్. దీని ధర రూ. 5,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

సోనీ డబ్ల్యూఐ సీ310 వైర్ లెస్ ఇయర్ ఫోన్స్..

సోనీ ఆడియో టెక్నాలజీ నుంచి వచ్చిన అనువైన బడ్జెట్ వైర్ లెస్ ఇయర్ ఫోన్లు ఇవి. నెక్ బ్యాండ్ స్టైల్ లో, లైట్ వెయిట్ తో అనువైన డిజైన్ లో ఉంటుంది. 15 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. వీటిలో రిచ్ సౌండ్ తో పాటు డీప్ బేస్ వస్తుంది. మ్యూజిక్ లవర్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 2,099గా ఉంది.

వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్..

అనువైన బడ్జెట్ తో పాటు అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ ఇయర్ ఫోన్లు ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తోంది. అలాగే ఇవి చాలా తక్కువ బరువుతో ఉంటాయి. దీనిలో పవర్ ఫుల్ బేస్ తో పాటు వాయిస్ కాల్స్ కు క్లియర్ గా వాయిస్ ను అందిస్తుంది. ఇది అదిరిపోయే ఆడియో అనుభవాన్ని అందిస్తోంది. దీని ధర మార్కెట్లో రూ. 1,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?
ఈ సమస్యలు ఉన్నవారికి పాలు విషంతో సమానం.. పొరపాటున కూడా
ఈ సమస్యలు ఉన్నవారికి పాలు విషంతో సమానం.. పొరపాటున కూడా
ఇప్పుడు కాదు.. మళ్ళీ చూసుకుందాం!
ఇప్పుడు కాదు.. మళ్ళీ చూసుకుందాం!
భారత్ గడ్డపై 100వ అంతర్జాతీయ మ్యాచ్..కివీస్ కెప్టెన్ భావోద్వేగం
భారత్ గడ్డపై 100వ అంతర్జాతీయ మ్యాచ్..కివీస్ కెప్టెన్ భావోద్వేగం