CNG Cars under 7L: తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ.. మార్కెట్లోని బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే..

మార్కెట్లో పర్యావరణ హితమైన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వేరియంట్ తో పాటు సరిసమానంగా సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలు కూడా మార్కెట్లో సేల్స్ రాబడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సీఎన్జీ వాహనాలకు డిమాండ్ దాదాపు 40శాతానికి పైగా పెరిగింది. ముఖ్యంగా కార్ల ఈ వెర్షన్లో ఎక్కువగా వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ తో పోల్చితే ఈ సీఎన్జీ తక్కువ ధరకు వస్తుండటంతో అందరూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు.

CNG Cars under 7L: తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ.. మార్కెట్లోని బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే..
Tata Tiago Cng
Follow us
Madhu

|

Updated on: Sep 20, 2023 | 4:15 PM

మార్కెట్లో పర్యావరణ హితమైన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వేరియంట్ తో పాటు సరిసమానంగా సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలు కూడా మార్కెట్లో సేల్స్ రాబడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సీఎన్జీ వాహనాలకు డిమాండ్ దాదాపు 40శాతానికి పైగా పెరిగింది. ముఖ్యంగా సీఎన్జీ వెర్షన్లో కార్లు ఎక్కువగా వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ తో పోల్చితే ఈ సీఎన్జీ తక్కువ ధరకు వస్తుండటంతో అందరూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ సీఎన్జీ గ్యాస్ ధర ఢిల్లీలో కేజీ రూ. 73.59 ఉంది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 దగ్గరలో ఉన్నాయి. సరిగ్గా ఇదే అంశంలో ప్రజలకు ఇది మంచి ఆప్షన్ గాకనిపిస్తోంది. పైగా వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. దీంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో అనువైన బడ్జెట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ సీఎన్జీ కార్లను ఇప్పుడు చూద్దాం..

టాటా టియాగో ఐసీఎన్జీ.. ఈ వేరియంట్ కార్లు రూ. 6.50లక్షల నుంచి రూ. 8.11లక్షలు (ఎక్స్ షోరూం) వరకూ ఉంటాయి. ఈ కారు కేజీకి 26.49 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. దీనిలో 1.2 లీటర్ 3 సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. 72బీహెచ్ పీ, 95ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకు గ్లోబల్ ఎన్ క్యాప్ సేఫ్టీ క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్ ఉంటుంది.

మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ సీఎన్జీ.. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 6.45 లక్షల నుంచి రూ. 6.90లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటాయి. ఇవి కేజీకి 34.05 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. దీనిలో ఎస్ ప్రెస్సో, అల్టో కే10 మాదిరిగానే 1 లీటర్, 3 సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56బీహెచ్ పీ, 82.1ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకీ ఎస్- ప్రెస్సో సీఎన్జీ.. ఇది కూడా ఎల్ఎక్స్ఐ. వీఎక్స్ఐ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 5.92లక్షలు, వీఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 6.12లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిలో 998సీసీ ఇంజిన్ ఉంటుంది. సీఎన్జీ మోడ్లో 56బీహెచ్ పీ, 82.1ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయొచ్చు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది కేజీ 32.73 కిలోమీటర్ మైలేజీ వస్తుంది.

మారుతి సుజుకీ అల్టో కే10 సీఎన్జీ.. ఈ కారు ధర రూ. 5.96 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిలో కూడా 998సీసీ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. 56బీహెచ్ పీ, 82.1ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేజీ సీఎన్జీకి 33.85 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..