AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: కౌంటర్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నారా.? ఇకపై ఇది తప్పనిసరి..

రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నవంబర్ 17 నుంచి ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత కొన్ని రైళ్లతో మొదలు పెట్టి తర్వాత 52 రైళ్లకు విస్తరించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Indian Railways: కౌంటర్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నారా.? ఇకపై ఇది తప్పనిసరి..
ticket Booking
Ravi Kiran
|

Updated on: Dec 04, 2025 | 1:43 PM

Share

తత్కాల్ టిక్కెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో కీలక మార్పునకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకునే తత్కాల్‌ టికెట్లకు ఓటీపీ వెరిఫికేషన్‌ తప్పనిసరి చేసింది. తాజాగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టిక్కెట్లకు కూడా వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను తప్పనిసరి చేయనుంది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిబంధనను అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నవంబర్ 17 నుంచి ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత కొన్ని రైళ్లతో మొదలు పెట్టి తర్వాత 52 రైళ్లకు విస్తరించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఇకపై కౌంటర్ వద్ద రిజర్వేషన్ ఫారమ్ నింపిన తర్వాత బుకింగ్ సమయంలో మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే టిక్కెట్ బుక్ అవుతుంది.

రైల్వే టికెట్ల విషయంలో ఇటీవల రైల్వేమంత్రిత్వ శాఖ పలు మార్పులు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా అసలైన ప్రయాణికులకు మేలు చేకూర్చేందుకు ఈ మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జులై నుంచి ఆన్‌లైన్‌ తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌కు ఆధార్‌ ఓటీపీ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. అక్టోబర్‌ నుంచి సాధారణ రిజర్వేషన్‌ టికెట్లకు సైతం తొలి 15 నిమిషాల బుకింగ్‌కు ఆధార్‌ అథంటికేషన్‌ ఉన్న యూజర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది.

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..