Personal Loan: ఆన్‌లైన్‌లో వ్యక్తిగత బ్యాంకు రుణం పొందడం ఎలా..? ఎవరెవరు అర్హులు.. పూర్తి వివరాలు

Personal Loan: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఇక బ్యాంకింగ్‌ రంగంలో కూడా చాలా ఎఫెక్ట్‌ చూపింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని అన్ని బ్యాంకులు..

Personal Loan: ఆన్‌లైన్‌లో వ్యక్తిగత బ్యాంకు రుణం పొందడం ఎలా..? ఎవరెవరు అర్హులు.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 13, 2021 | 11:17 AM

Personal Loan: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఇక బ్యాంకింగ్‌ రంగంలో కూడా చాలా ఎఫెక్ట్‌ చూపింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని అన్ని బ్యాంకులు ఆన్‌లైన్‌లోనే సేవలందిస్తున్నాయి కస్టమర్లకు. కస్టమర్లకు సేవలను మరింత సులభతరం చేసేందుకు తదితర సేవలను ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక రుణం కూడా ఆన్‌లైన్‌లో తీసుకోవడం ఉత్తమం. దరఖాస్తు ప్రాసెసింగ్‌ మరింత వేగవంతం చేశాయి బ్యాంకులు. పూర్తిగా డిజిటల్‌ మార్గంలోనే వ్యక్తిగత రుణం పొందేందుకు అవకాశం ఉంది.

రుణం పొందేందుకు ఎవరు అర్హులు..?

వేతన జీవులు,వృత్తి నిపుణులు, వ్యాపారులతో పాటు సంప్రదాయ మార్గంలో వ్యక్తిగత రుణం తీసుకునేందుకు అర్హులైన వారందరూ డిజిటల్‌ మార్గంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ప్రముఖ బ్యాంకులు, ఫైనాన్సియల్‌ టెక్నాలజీ కంపెనీలు డిజిటల్‌ రుణాలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఆఫ్‌లైన్‌ రుణాలతో పోలిస్తే ఆన్‌లైన్‌ రుణాలే కాస్త చౌక అని చెప్పాలి. అయితే వడ్డీ రేటు మాత్రం దరఖాస్తుదారు ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, రుణ మొత్తం వంటి వివరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వార్షిక వడ్డీ రేటు 10.25 శాతం నుంచి 36 శాతం వరకు ఉంటుంది. కాబట్టి మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు ఆఫర్లను పోల్చి చూసుకుంటే మీకు తగిన లోన్స్‌ స్కీమ్‌ను ఎంచుకోవడం బెటర్‌.

అయితే రుణం పొందాలంటే మీ వ్యక్తిగత వివరాలు, ఆదాయం, చిరునామా, పాన్‌కార్డు, క్రెడిట్‌ స్కోరుకు సంబంధించి సరైన, తాజా ధృవీకరణ పత్రాలను సిద్ధం ఉంచుకోవాలి. లోన్‌ ప్రాసెసింగ్‌లో భాగంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు మీ పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు తదితర పత్రాలు తప్పనిసరి. ఎందుకంటే, ఆన్‌లైన్‌ రుణ దరఖాస్తుతో పాటు ఈ పత్రాలనూ స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

రుణం పొందడం ఎలా..?

మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌తో పాటు మొబైల్‌ నెంబర్‌ లింక్‌ అయి ఉండాలి. ఒక వేళ ఖాతాకు ఇవి అనుసంధానం కాకపోతే ఆ ప్రక్రియను ముందుగా పూర్తి చేయాలి. మీరు రుణదాతకు సమర్పించబోయే అకౌంట్‌కు నెట్‌ బ్యాంకింగ్‌ వసతి కలిగి ఉండాలి. లేని పక్షంలో నెట్‌ బ్యాంకింగ్‌ను యాక్టివ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్‌ ఆకౌంట్‌, ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్‌ నంబరునే రుణ దరఖాస్తులో పొందుపర్చాలి. ప్రస్తుతం మీరు నివసిస్తున్న చిరునామా మీ బ్యాంక్‌ ఖాతా బుక్‌, ఆధార్‌లోనూ అప్‌డేట్‌ అయి ఉండాలి. ఒకవేళ మీరు అధికారిక ఈ-మెయిల్‌ అడ్రస్‌ కలిగి ఉంటే, దాని ద్వారా మెయిల్స్‌ రిసీవ్‌ చేసుకోవడంతో పాటు పంపగలిగే వెసులుబాటు కలిగి ఉండాలి. వీటన్నింటిని ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత బ్యాంకు వారు పరిశీలించి మీరు లోన్‌ పొందేందుకు అర్హులై ఉంటే రుణాన్ని మంజూరు చేస్తారు.

ఇవీ కూడా చదవండి:

Post Office Saving Schemes Fraud: పోస్టాఫీసులో పొదుపు పథకాల్లో మీకు మోసం జరిగిందా..? ఫిర్యాదు చేయండిలా

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!