AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buy Now Pay Later: పండగ వస్తోంది.. ముందు కొనేసి తరువాత కట్టేద్దాం అనుకుంటున్నారా? జాగ్రత్త!

ఇటీవల కాలంలో చాలా మంది బై నౌ పే లేటర్ (BNPL) వంటి ఆప్షన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. బై నౌ పే లేటర్ సర్వీస్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డు తో పోలిస్తే బై నౌ పే లేటర్ చాలా ఆకర్షణీయంగా.. సులభమైన మార్గంగా ఉండడమే దీనికి కారణం అని చెప్పొచ్చు. ఈ విధానంలో వడ్డీలేని అప్పు దొరుకుతుంది. ఈ లోన్ ప్రక్రియ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నెల నెలా కట్టేలా ఈఎంఐ అవకాశం

Buy Now Pay Later: పండగ వస్తోంది.. ముందు కొనేసి తరువాత కట్టేద్దాం అనుకుంటున్నారా? జాగ్రత్త!
Buy Now, Pay Later
Subhash Goud
|

Updated on: Oct 04, 2023 | 5:55 PM

Share

పండగ సీజన్ వచ్చేసింది. ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ ఆఫర్ల వెల్లువ ప్రారంభం కోసం కౌంట్ డౌన్ మొదలు పెట్టేశాయి. మన దేశంలో అతి పెద్ద ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ – అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభంజ్ కాబోతున్నాయి. బట్టలు, మొబైల్ ఫోన్లు – ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 90% వరకు తగ్గింపు ఇస్తామంటూ ఇప్పటికే ప్రచార హోరు మొదలు పెట్టేశాయి ఈ రెండు కంపెనీలు. క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తామని కంపెనీలు చెబుతున్నాయి.

ఇది కాకుండా, ఇటీవల కాలంలో చాలా మంది బై నౌ పే లేటర్ (BNPL) వంటి ఆప్షన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. బై నౌ పే లేటర్ సర్వీస్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డు తో పోలిస్తే బై నౌ పే లేటర్ చాలా ఆకర్షణీయంగా.. సులభమైన మార్గంగా ఉండడమే దీనికి కారణం అని చెప్పొచ్చు. ఈ విధానంలో వడ్డీలేని అప్పు దొరుకుతుంది. ఈ లోన్ ప్రక్రియ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నెల నెలా కట్టేలా ఈఎంఐ అవకాశం కూడా ఈ విధానంలో ఉన్న మరో సౌలభ్యం. అసలు ఈ బై నౌ పే లేటర్ అంటే ఏమిటి? దీనివలన లాభమా? నష్టమా? వీటి గురించి తెలుసుకుందాం.

బై నౌ పే లేటర్ (BNPL) అంటే ఇప్పుడు కొనండి.. తరువాత డబ్బులు ఇవ్వండి అనే విధానం. అంటే మీరు ఏదైనా వస్తువును ఇష్టపడితే మీదగ్గర డబ్బు లేకపోయినా కొనుక్కోవచ్చు. ఇంకా మనకి తెలిసిన విధానంలో చెప్పాలంటే.. గతంలో ఇంటింటికీ ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్‌ పేరుతో వస్తువులు తెచ్చి ఇచ్చేవారు. వారు మనకు కావలసిన ఫ్యాన్.. టీవీ, కుక్కర్, మొబైల్‌ ఇలా రకరకా ఇలాంటి వస్తువు తెచ్చి ఇచ్చి దానిపై కొంత లాభం కలుపుకుని.. ప్రతి వారం.. లేదా నెల నెలా ఇంత అని డబ్బులు కట్టించుకునేవారు. ఇప్పుడు ఆ విధానమే ఆన్‌లైన్‌లో బై నౌ పే లేటర్‌గాగా ప్రత్యక్షం అయిందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు డిజిటల్ యుగం కదా.. అందుకే ఈ విధానం బాగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. అయితే, దీనివలన వస్తువు కొనుక్కునేవారికి ఎంత ఉపయోగం అనేది చూద్దాం. బై నౌ పే లేటర్ అనేది ఒకరకమైన అప్పు. ఈ విధానంలో మనకు కావలసిన వస్తువు వెంటనే ఆర్డర్ చేయవచ్చు. దానికి అవసరమైన డబ్బును ఈ విధానంలో లోన్ అందించే సంస్థ కంపెనీకి చెల్లిస్తుంది. తరువాత ఆ డబ్బును కస్టమర్ దగ్గర నుంచి ఒకేసారి లేదా ఈఎంఐ విధానంలో వసూలు చేస్తుంది. దీనికోసం కొంత ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం ఈ రకమైన సర్వీసులను అందిస్తున్నాయి.

బీఎన్‌పీఎల్‌ (బై నౌ పే లేటర్) సర్వీస్ ను జాగ్రత్తగా ఉపయోగించుకోలేకపోతే అది మనల్ని రుణాల ఉచ్చులో పడేస్తుంది. సాధారణంగా ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేటపుడు మన మనసుపై ఆ షాపింగ్ సైట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించే వస్తువులు.. ఆకట్టుకునే ధరలు.. అంతకు మించి డబ్బు ఉన్నాలేకపోయినా కొనుక్కోగలిగే వెసులుబాటు. ఇవి ఎంత ఆర్ధిక క్రమ శిక్షణ కలిగిన వారినైనా బుట్టలో పడేస్తుంది. దీంతో అవసరం లేని వస్తువులను కొనేయడం ఒక్కోసారి మనం అనుకోకుండానే జరిగిపోతుంది. దీంతో దాని ఈఎంఐ లు కట్టడానికి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.

ఒకవేళ సరైన సమయంలో ఈఎంఐ కట్టలేకపోతే.. సంస్థలు సిబిల్ కు రిపోర్ట్ చేస్తాయి. దీంతో మన క్రెడిట్ స్కోర్ పాడైపోతుంది. తరువాత నిజంగా అత్యవసర సమయంలో లోన్ దొరకడం కష్టమైపోతుంది. అయితే, ఈ విధానాన్ని విచక్షణతో ఉపయోగిస్తే.. మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అదేవిధంగా లోన్ చెల్లించలేని పరిష్టితి వస్తే అన్ని రకాలుగానూ ఇరుక్కుపోతారు. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం BNPL పద్దతి అవసరం లేని కొనుగోళ్లను ప్రోత్సహిస్తుంది. దీనివలన ప్రజలు అవసరం కంటే ఎక్కువగా సులభంగా వస్తువు వచ్చేస్తోంది అనే ధ్యాసలో పడిపోతారు. దీంతో అనవసరంగా అప్పుల బాటలో వెళ్ళిపోతారు. అత్యవసరం అయితేనే ఈ విధానంలో వస్తువులు కొనుగోలు చేయాలి. అలాగే మీకు అవసరమైన వస్తువు మంచి డిస్కౌంట్ తో దొరుకుతున్న సందర్భంలో.. మీ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటేనే బై నౌ పే లేటర్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జేబుకు మించిన కొనుగోళ్లు మన ఆర్థికపరిస్థితి తల్లకిందులు చేస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

ఇన్ని చెప్పుకున్నాం కదా.. ఇప్పుడు బై నౌ పే లేటర్ బిజినెస్ మన దేశంలో ఎంత పెద్దగా ఓ లుక్కేద్దాం.. గోల్డ్‌మన్ సాచ్స్ లెక్కల ప్రకారం.. భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమ 2024 నాటికి $99 బిలియన్లకు చేరుకుంటుంది. గత సంవత్సరం వరల్డ్‌పే గ్లోబల్ పేమెంట్స్ రిపోర్ట్ ప్రకారం, 2024 నాటికి BNPL 3% నుండి 9%కి పెరుగుతుంది. ఆన్‌లైన్ కొనుగోలు లేదా ఇ-కామర్స్ పరిశ్రమ పెరిగితే, BNPL కూడా పెరుగుతుంది. లేజీ పే, సింపుల్, జెస్ట్ మనీ, అమెజాన్ పే లేటర్, స్లైస్, పేటీఎం పోస్ట్‌పెయిడ్ వంటివి భారతదేశంలో బిఎన్‌పిఎల్ సేవలను అందిస్తున్న కొన్ని కంపెనీలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి